క్రిస్మస్ స్పెషల్.. ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ..
క్రిస్మస్ సందర్భంగా ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రానుంది. అదే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- భాగ్య శ్రీ బోర్సే జంటగా తెరకెక్కిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు పి. దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. నవంబర్ 27 న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా .. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ఓటీటీలో రిలీజ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగుతోపాటుగా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. ఓ స్టార్ హీరో అభిమాని కథగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి జంటగా భాగ్య శ్రీ బోర్సే ఆడి పాడింది. యంగ్ డైరెక్టర్ మహేశ్‌బాబు. పికు ఇది రెండో సినిమా. ఇక ఈ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. వారితోపాటు మురళీ శర్మ, రావు రమేశ్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు. ఈ మూవీకి సంగీతాన్ని వివేక్-మెర్విన్ అందించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.












Click it and Unblock the Notifications