రాజుకున్న నిప్పు... భగ్గుమన్న విభేదాలు?
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏర్పాటైనప్పటి నుంచి హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగుతుండటం సహజంగా జరుగుతుంటాయి. తమ హీరో గొప్ప అంటే కాదు తమ హీరో గొప్ప అని వాదులాడుకుంటారు. తమ హీరోల సినిమాలు ఎన్ని సెంటర్లలో వందరోజులు ఆడింది? ఎంత వసూలు చేసింది? ఏ హీరో ఎక్కువ? ఏ హీరో తక్కువ?.. ఇలా అనేకరకాలుగా రికార్డుల విషయాల్లో ఒక్కోసారి అభిమానుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. గతంలో థియేటర్ల వద్ద గొడవలు జరుగుతుండేవి. ప్రస్తుతం కాలం మారడంతో సామాజిక మాధ్యమాల్లో యుద్ధాలు చేసుకుంటున్నారు.
హీరోలను కూడా ట్రోల్ చేస్తున్నారు
సామాజిక మాధ్యమాల్లో హీరోల అభిమానులు పెడుతున్న కామెంట్లు చాలా దారుణంగా, అసభ్యంగా ఉంటున్నాయి. ఇవి చూస్తుంటే వీరంతా చదువుకున్నవారేనా? అనిపిస్తుంటుంది. ఒకరికి కుల పిచ్చి.. మరొకరికి మరో పిచ్చి.. ఇలా పిచ్చి ఎన్నిరకాలుగా ఉండాలో సోషల్ మీడియాలో అభిమానులకు అన్నిరకాల పిచ్చి ఉంది. తమ హీరోమీద అభిమానంతో వేరే హీరో సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ సినిమాను చంపేస్తుంటారు. హీరోను ట్రోలింగ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుండేది. హీరో కంటెంట్ ను కిందపడేయడం, సినిమాను పడేయడం జరుగుతోంది.

గుంటూరు కారం సినిమా సమయంలో కూడా
గుంటూరు కారం సినిమా, సర్కారువారి పాట సినిమా విడుదల సమయంలో కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతం దేవర విడుదల నేపథ్యంలో నందమూరి అభిమానులు, మెగా అభిమానుల మధ్య అంతరం బాగా పెరిగింది. ఇటువంటి తరుణంలోనే నిర్మాత దిల్ రాజు మెగా అభిమానులతో మాట్లాడారు. మీరు ఇలా చేస్తే రేపు మీ సినిమా వచ్చినప్పుడు వాళ్లు అలా చేస్తారు.. అలాంటివి వద్దు అని చెప్పినట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్లు లేవని అభిమానులు దిల్ రాజుతో అన్నట్లు తెలిసింది. అన్నీ సరిగ్గానే జరుగతాయని దిల్ రాజు వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications