మెడలో తాళి బొట్టుతో షాకిచ్చిన 'కోర్టు' సినిమా హీరోయిన్..సీక్రెట్‌గా పెళ్లి ..?

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులారిటీ పొంది, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలు చాలా తక్కువ మందే ఉన్నారు. బుల్లితెరపై కనిపించి, ఆ తర్వాత బిగ్‌బాస్ వంటి షోలలో పాల్గొని, అదృష్టం బాగుంటే సినిమాల్లోకి వెళ్లేవారే ఎక్కువ. కానీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేరుగా సినిమా అవకాశాలు అందుకున్న వారిలో 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి ఒకరు. ఈ ఏడాది సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'కోర్ట్' చిత్రంలో శ్రీదేవి అద్భుతంగా నటించి, కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

ఈ సినిమా విజయంతో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. దీంతో పాటు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, రెస్టారెంట్ ఓపెనింగ్స్ అంటూ రెండు చేతులా బాగా సంపాదిస్తోంది. ఇంత చిన్న వయసులో ఈ స్థాయిలో సంపాదించడం నిజంగా గొప్ప విషయం.

Court Actress Sridevi s Secret Marriage Rumors Debunked The Truth Behind the Viral Photos

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీదేవి, ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె తన బంధువులకు రాఖీలు కడుతూ కనిపించారు. ఈ వీడియోలో జనాలు ఆమెను గమనిస్తున్నప్పుడు ఆమె మెడలోని పసుపు తాడు (తాళిబొట్టు) చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

సాధారణంగా, పసుపు తాడుని పెళ్లైన వాళ్ళు మాత్రమే ధరిస్తారు. ఇది చూసి నెటిజన్లు "శ్రీదేవికి పెళ్లి ఎప్పుడు అయ్యింది? ఎవరికీ తెలియకుండా చేసుకుందా? వరుడు ఎవరు?" అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది ఇది సినిమా షూటింగ్‌లో భాగం కావచ్చు అని వాదిస్తుండగా, మరికొందరు ఆమె ఇంట్లోనే ఉన్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోందని, షూటింగ్‌ కానప్పుడు పసుపు తాడు ఎందుకు ధరిస్తుందని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై శ్రీదేవి స్పందిస్తే కానీ ఈ సస్పెన్స్ వీడేలా లేదు. ఒకవేళ ఆమె పెళ్లి చేసుకుని ఉంటే, ఆ విషయం ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+