సెంట్రల్ జైలుకు ప్రముఖ హీరోయిన్..!
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదివారం ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 29 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం కస్తూరిని పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఓ రాజకీయ సభలో ఆమె మాట్లాడుతూ..అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు వచ్చారంటూ కస్తూరి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వారిని కించపరుస్తూ మాట్లాడటంపై తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. వివాదం పెద్దది కావడంతో వెంటనే తాను అలాంటి ఉద్దేశంతో అనలేదని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. మూడు రోజుల క్రితం కస్తూరిపై చెన్నైలో కేసులు నమోదవ్వగా.. ఆమెకు సమన్లు జారీ చేసేందుకు పోలీసులు ఇంటికెళ్లారు. ఆమె ఇంటికి తాళం వేసి ఉండటంతో ఫోన్ చేశారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది. అరెస్ట్ చేస్తారనే భయంతో నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కస్తూరి శంకర్ హైదరాబాద్‌లో ఉన్నారనే సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు, ఇక్కడ ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

గచ్చిబౌలిలో ఆమె ఉన్నట్టు సమాచారం అందుకున్న చైన్నై పోలీసులు శనివారం కస్తూరి శంకర్ ఉన్న ప్రదేశానికి చేరుకుని అరెస్ట్ చేశారు.తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరినప్పటికీ హైకోర్టు ఆమె పిల్‌ను కొట్టివేసింది. దీంతో కస్తూరి శంకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా, హైదరాబాద్‌లో ఉన్నారని తెలియడంతో శనివారం రాత్రి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications