అనుపమకు మరో క్రేజీ ఛాన్స్.. ఈసారైనా హిట్ కొడుతుందా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు కథానాయికలు ఒక్క హిట్‌తోనే ఏళ్ల తరబడి అవకాశాలు పట్టుకుంటే అనుపమ పరమేశ్వరన్ మాత్రం ప్రతిసారీ తన కెరీర్‌ను కొత్తగా ప్రారంభించాల్సి వస్తోంది. 'ప్రేమమ్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ క్యూట్ బ్యూటీ ఖాతాలో 'కార్తికేయ 2', '18 పేజెస్' వంటి భారీ విజయాల వరకు అనుపమ పరమేశ్వరన్ ప్రయాణంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి. అయితే వీటితో పాటు ఎదురైన వరుస ఫ్లాపులు ఆమె కెరీర్ గ్రాఫ్‌ను ఊహించని విధంగా మార్చేశాయి.
ఈ కెరీర్ గ్రాఫ్ అనుపమ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. 'ప్రేమమ్' తెచ్చిపెట్టిన అమాయకమైన స్వీట్ గర్ల్ ఇమేజ్‌కే అనుపమ పరిమితం అయిపోలేదు. 'టిల్లు స్క్వేర్' సినిమాలో మునుపెన్నడూ చూడని సరికొత్త బోల్డ్ అవతారం అలరించిన అనుపమ.. 'పరదా' వంటి నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో ఎంత గొప్ప నటి అయినా ఒక్క విజయాన్ని ఖాయం చేయలేదని నిరూపించుకుంది. అయినప్పటికీ గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ భాషతో సంబంధం లేకుండా భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకుంటోంది.

ఇప్పుడు'క్రేజీ కళ్యాణం' రూపంలో అనుపమ పరమేశ్వరన్‌కు మరో మంచి అవకాశం వచ్చింది. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ తెలుగు సినిమాలో ఆమె 'కీర్తి' అనే ప్రధాన పాత్రలో కనిపిస్తోంది. వివాహం పట్ల తనకున్న ఆలోచనలకు, తండ్రి వేసే పెద్ద ప్లాన్లకు మధ్య నలిగిపోయే ఓ ఆధునిక యువతి కథగా ఇది రాబోతోంది.
తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ కొత్తదేమీ కాదు. కానీ వరుస హిట్లు, ఫ్లాపులు, ప్రయోగాల తర్వాత తన కెరీర్ గ్రాఫ్‌ను మళ్లీ పైకి తీసుకెళ్లడానికి 'క్రేజీ కళ్యాణం' సినిమా ఆమెకు ఓ పునాదిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా ద్వారా అనుపమ టాలీవుడ్ లో సరికొత్త విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.














Click it and Unblock the Notifications
