స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు, బీసీ రిజర్వేషన్ల జీవోల రద్దు..!!
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టి వేసింది. సర్ ప్రక్రియ ముగిసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు తోసి పుచ్చింది. ఆరు వారాల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. సుప్రీం నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ జీవో ఉందని కోర్టు అభిప్రాయ పడింది.
హైకోర్టు ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్ల పైన దాఖలైన అన్ని పిటీషన్ల పైన విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను కోర్టు కొట్టివేసింది.

హైకోర్టు నిబంధనలకు భిన్నంగా ఉన్నాయంటూ ప్రభుత్వం జారీ చేసిన 105, 1065 జీవోలను కొట్టి వేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అదే సమయంలో సర్ పక్రియ పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించ వద్దంటూ వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం తోసి పుచ్చింది. దీంతో.. స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. కాగా.. బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేయటంతో ఇక పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల ప్రక్రియ పైనా ప్రభుత్వం.. ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వార్డుల పునర్విభజన పైన దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. బీసీ జనగణన తరువాత ఎన్నికలు నిర్వహించాలనే పిటీషన్ ను న్యాయస్థానం తోసి పుచ్చింది. కాగా.. SIR ప్రక్రియ ఈ నెల పదికి పూర్తి కానుంది. ఈ నెల పదహారున ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. దీంతో.. తుది జాబితా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దసరా తరువాత ఈ నెలాఖరులో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం - ఎన్నికల సంఘం ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం సైతం తాము ఎన్నికల నిర్వహణకు పూర్తి సమాయత్తం అయినట్లు వెల్లడించింది. తాజాగా హైకోర్టు తీర్పుతో ఇక ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది.













Click it and Unblock the Notifications
