మెగా అభిమానులకు క్రేజీ అప్‌డేట్.. గేమ్ ఛేంజర్ డబ్బింగ్ షూరూ..!
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్ సినిమాతో ఫుల్ బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం కాబట్టి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇప్పడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ అందింది. ఆ వార్త విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ మూడ్‌లో ఉన్నారు. అదేంటని అనుకుంటున్నారా..? గేమ్ ఛేంజర్ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే, ఈ చిత్రం క్రిస్మస్‌కు విడుదల చేస్తామని ఇటీవలే ప్రొడ్యూసర్ దిల్‌రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో అప్‌డేట్ అందింది. గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు షురూ అంటూ నిర్మాత దిల్‌రాజు సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇక, ఇది చూసిన మెగా అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.
పోస్ట్ షేర్ చేసిన నిర్మాత..
దిల్‌రాజు పెట్టిన పోస్టులో ఇలా రాసి ఉంది. "గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ డబ్బింగ్ పనులు ప్రారంభించేసింది. మెగా ఫైర్ వర్క్స్‌కి సిద్ధం కండి. క్రిస్మస్ 2024" అంటూ డబ్బింగ్ సెషన్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ వార్త విన్న మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గేమ్‌ఛేంజర్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం.
దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రామ్‌చరణ్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఇంకో షెడ్యూల్ మాత్రమే షూటింగ్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications