అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..!
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ రూటే సెపరేటు.. కెరీర్ బిగినింగ్ లో రన్ రాజా రన్, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత 2016 లో వచ్చిన క్షణం మూవీతో హీరోగా తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక 2017 లో అమితుమీ లాంటీ కామెడీ మూవీ చేసినా.. ఆ తర్వాత ఎవరు, మేజర్, హిట్ 2, గూఢచారి లాంటి వైవిధ్యమైన కథలతో హిట్స్ కొడుతూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు అడవి శేష్ మూవీ అంటే మినిమం గ్యారంటీ అనే పేరు వచ్చింది.
అయితే తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లో కనిపిస్తున్న జైలు బ్రేక్ సీన్, పోలీస్ ట్రాన్స్ ఫర్ అటాక్, ఉత్కంఠభరితమైన ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో చెబుతోంది.
ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఇస్తారని అంతా భావించినా.. సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం చిత్ర యూనిట్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక సెన్సార్ బృందం ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మేకర్స్ కు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

డెకాయిట్ మూవీ ఫస్టాఫ్ ఆసక్తికరంగా ఉందని.. సెకండాఫ్ లో అద్దిరిపోయే ట్విస్టులతో థ్రిల్లింగ్ క్లైమాక్స్ తో ముగుస్తుందని సమాచారం. ఇక మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో చూడలేదని టాక్.. మొత్తానికి అడవి శేష్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫుల్ రివ్యూ కోసం సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications