తమ కూతురి ఫొటోను, పేరును రివీల్ చేసిన దీపికా, రణవీర్ సింగ్..
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ ముద్దుల కూతురు తొలి ఫోటోను, పేరును ప్రకటించారు. కానీ, కూతురి పూర్తి ఫోటో కాకుండా వాళ్లు కేవలం ఆమె కాళ్లు మాత్రమే కనిపించేలా ఓ ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆమె పేరును కూడా ప్రకటించారు. తమ కూమార్తెకు దువా పదుకోన్ సింగ్ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ''దువా అంటే ప్రార్థన అనే అర్థం. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె'' అంటూ తమ చిన్నారి కాళ్లను ఫొటో తీసి నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
ఈ ఫోటోపై అభిమానులతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా స్పందిస్తున్నారు. అలియా భట్, మమితా బైజు, షాలినీ పాండే వంటి బాలీవుడు సినీ ప్రముఖులు కామెంట్లు పెడుతున్నారు. 'క్యూట్' అంటూ లవ్ ఎమోజీలు కూడా జోడిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకుణే 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ ఏడాది సెప్టెంబరు 8వ తేదీన దీపికా పదుకుణే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే, అప్పటి నుంచీ ఆమెకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ కానీ, ఫోటోనూ ఈ కపుల్ ఇంతవరకూ రివీల్ చేయలేదు. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరూ ప్రైవసీ అంటూ తమ పిల్లల ఫొటోలను కొంతకాలం వరకు రివీల్ చేయరు. ఇప్పడు మొదటిసారి దీపావళి పండుగ సందర్భంగా తమ కూతురి ఫొటోను పంచుకున్నారు. అదికూడా కేవలం కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో ఆపాటు ఆమె పేరునూ కూడా వెల్లడించారు.
ఎన్నో హిట్ మూవీలు..
బాలీవుడ్ లో ఈ జంట కలిసి నటించిన చాలా సినిమాలు మంచి హిట్‌ను అందుకున్నాయి. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, 83లాంటి హిట్ మూవీస్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే, ఇటీవలే విడుదలయి రికార్డులు బద్దలు కొట్టిన 'కల్కి 2898 ఏడీ'తో చిత్రంలో దీపికా నటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పలు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. 'సింగమ్ అగైన్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది దీపికా. ఇక, ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications