దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్
బాలీవుడ్ భామ దీపికా పదుకొనె పారితోషికానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి 2829 AD చిత్రానికి రికార్డు స్థాయిలో ఆమె పారితోషికాన్ని తీసుకున్నారనేది ఈ వార్త సారాంశం. కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీగా తీస్తున్నారు. ఈ జోనర్ లో సినిమా చేయడం ప్రభాస్ కు ఇదే మొదటిసారి. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కూడా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ రూ.600 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు.
దీపికా పదుకొనేకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. లేడీ వారియర్ గెటప్ లో అద్భుతంగా ఉన్నారంటూ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా కోసం దీపిక రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె అడిగినంత నిర్మాత ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా దీపిక నిలిచినట్లైంది.

సాధారణంగా సినిమాకు రూ. 12 నుండి 15 కోట్లు తీసుకుంటుంది. కల్కికి ఎక్కువ మొత్తంలో కాల్ షీట్స్ కేటాయించాల్సి ఉండటంతో ఆమె రూ.20 కోట్లు అడిగారంటున్నారు. రష్మిక, సమంత, కత్రినాకైఫ్ లాంటివారు కేవలం రూ.4 నుంచి రూ.5 కోట్ల మధ్యలో తీసుకుంటున్నారు. హీరోలకు సమానంగా దీపిక కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆమె అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోందనే వార్తలు కూడా వస్తున్నాయి. హైదరాబాద్ లో కల్కి షూటింగ్ జరుగుతున్న సమయంలో కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే దీపికను ఆసుపత్రికి తరలించారు. మానసిక ఒత్తిడి కారణంగా షూటింగ్ సరిగా చేయేకపోయారంటూ వచ్చిన వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. ఒకప్పుడు రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన దీపిక అతడితో బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లింది. అనంతరం మరో హీరో రణ్ వీర్ సింగ్ ను వివాహం చేసుకుంది.












Click it and Unblock the Notifications