Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవాజ్ షరీఫ్ నుంచి అజిత్ ధోవల్ దాకా.. ధురంధర్ 2లో ఎవరెవరు ఏ రోల్?

బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 'ధురంధర్: ద రివెంజ్' అనే టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమాలో యాక్షన్, డ్రామా ప్రేక్షకులను ఊపేస్తున్నాయి. అయితే, ఈ సినిమాలో నటించిన నటీనటుల కంటే, వారు పోషించిన పాత్రలు.. ముఖ్యంగా నిజ జీవితంలోని మాఫియా డాన్లు, రాజకీయ నాయకులతో ఉన్న పోలికలు చూసి జనం షాక్ అవుతున్నారు.ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్రలు పోషించారో, వారి లుక్స్ ఎవరిని పోలి ఉన్నాయో తెలుసుకుందాం.

'ధురంధర్ 2' పాత్రలు - అసలు వ్యక్తులు వీరే..
*రణవీర్ సింగ్ (హంజా అలీ మజారీ / జస్క్రీత్ సింగ్ రంగీ):
రణవీర్ ఈ సినిమాలో డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. మొదటి పార్ట్‌లో రెహమాన్ డకైత్ అనుచరుడిగా కనిపించిన ఆయన.. సెకండ్ పార్ట్‌లో ల్యారీ కింగ్‌గా శత్రువుల గుండెల్లో నిద్రపోతాడు.

Dhurandhar 2 Who Played Dawood Atiq Ahmed and Ajit Doval See the Shocking Real Life Looks

*దానిష్ ఇక్బాల్ (దావూద్ ఇబ్రహీం):
సినిమాలో 'బడే సాహబ్' ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్రలో దానిష్ ఇక్బాల్ ఒదిగిపోయారు. ఆయన లుక్ చూసి ప్రేక్షకులు అచ్చం దావూద్‌లాగే ఉన్నారని ఆశ్చర్యపోతున్నారు.

*సలీం సిద్ధిఖీ (అతీక్ అహ్మద్):
ఈ సినిమాలో సలీం సిద్ధిఖీ 'అతీక్ అహ్మద్' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించారు. ఇది కుప్రసిద్ధ మాఫియా డాన్, రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ జీవితం ఆధారంగా రూపొందించబడింది.

*మష్నూర్ అమ్రోహి (నవాజ్ షరీఫ్):
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాత్రలో మష్నూర్ అమ్రోహి కనిపించారు. సినిమాలో ఆయన పేరు 'నవాబ్ షఫీక్'. ఆయన మేకప్, హావభావాలు నవాజ్ షరీఫ్‌ను తలపిస్తున్నాయి.

*ఆర్ మాధవన్ (అజిత్ ధోవల్):
ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్‌గా మాధవన్ అదరగొట్టారు. ఈ పాత్ర భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్ఫూర్తితో రూపొందించబడింది.

*అర్జున్ రాంపాల్ (మేజర్ ఇక్బాల్):
*ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా అర్జున్ రాంపాల్ పవర్‌ఫుల్ విలనిజం పండించారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే నెగటివ్ రోల్‌లో ఆయన నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.

*రాకేష్ బేడీ (నబీల్ గబోల్):
పాకిస్థాన్ రాజకీయ నాయకుడు నబీల్ గబోల్ ఆధారంగా రూపొందించిన 'జమీల్ జమాలి' పాత్రలో రాకేష్ బేడీ నటించారు.

*సంజయ్ దత్ (చౌదరి అస్లాం):
లారీ టాస్క్ ఫోర్స్ చీఫ్ ఎస్పీ చౌదరి అస్లాం పాత్రలో సంజయ్ దత్ మాస్ లుక్‌లో కనిపించారు.

ఇతర ప్రధాన తారాగణం:
*యామీ గౌతమ్: షాజియా బానో (నర్స్) పాత్రలో చిన్న క్యామియోలో కనిపించింది.

*సౌమ్య టాండన్: రెహమాన్ డకైత్ భార్య 'ఉల్ఫత్' పాత్రలో మెరిసింది.

*గౌరవ్ గేరా: పాకిస్థాన్‌లోని ఇండియన్ స్పై 'మొహమ్మద్ ఆలం'గా అలరించారు.

*సారా అర్జున్: రణవీర్ సింగ్ భార్యగా, రాకేష్ బేడీ కూతురిగా యలీనా జమాలి పాత్రలో నటించింది.

*మొదటి పార్ట్‌లో మెరిసిన అక్షయ్ ఖన్నా (రెహమాన్ డకైత్) పాత్ర సెకండ్ పార్ట్‌లో లేకపోవడంతో అభిమానులు ఆయన్ని బాగా మిస్సవుతున్నారు. అయినప్పటికీ రియల్ లైఫ్ క్యారెక్టర్లను పోలిన నటుల ఎంపిక 'ధురంధర్ 2' విజయానికి ప్రధాన కారణం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+