'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..??
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్-2 దండయాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీ హిందీ వెర్షన్ విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 430 కోట్ల నెట్ వసూలు చేసింది. ఈ మేరకు పుష్ప-2 రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఐదురోజుల్లో ఈ మూవీ గ్రాస్ రూ. 619.76 కోట్లు ఉండగా గ్లోబల్ కలెక్షన్లలో గ్రాస్ రూ. 829.76 కోట్లకు చేరినట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో ధురంధర్-2 రూ.1000 కోట్ల మార్క్ చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ధురంధర్ మూవీలో హీరోయిన్ పాత్ర కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా మారింది. ఈ మూవీలో సరా అర్జున్ హీరోయిన్ గా నటించింది. ఈ పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పాత్రకోసం ముందుగా బాలీవుడ్ నటి కియారా అద్వాణీని సంప్రదించారట. కానీ ఆమె ఆ సమయంలో వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో ఆ ఛాన్స్ సరా అర్జున్ కు వెళ్లిందట.
అయితే ఇప్పటికే వరుసగా ప్లాఫ్ సినిమాలతో ఉన్న కియారా అద్వాణీ ధురంధర్ సినిమాను ఓకే చేస్తే.. ఆమె కెరీర్ కు ఈ మూవీ మేజర్ టర్నింగ్ పాయింట్ అయ్యేదని నెటిజన్లు భావిస్తున్నారు. వరుస ప్లాఫ్స్ లో ఉన్న ఈ హీరోయిన్ కు ధురంధర్ మూవీ వరల్డ్ వైడ్ గా క్రేజ్ తీసుకొచ్చేదని అంటున్నారు. కియారా గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకుందని నెటిజెన్స్ మండిపడుతున్నారు.

ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాతో ఇండస్ట్రీకు పరిచయం అయింది కియారా అద్వాణీ. ఆ తర్వాత వినయ విధేయ రామ, కబీర్ సింగ్, గుడ్ న్యూస్, భూల్ భూలయా, గేమ్ ఛేంజర్ లాంటి చిత్రాల్లో నటించింది. అలాగే వార్ 2 మూవీలోనూ కియారా నటించింది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ యశ్ తో టాక్సిక్ మూవీలో నటిస్తోంది కియారా.. ఈ మూవీతో అయినా కియారా కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications