ఆ డైరెక్టర్ రూట్ మార్చాడా.. మూవీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ

ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. యాక్షన్ డ్రామా చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న లోకేశ్.. సినిమాటిక్ యూనివర్శ్ క్రియేట్ చేసి వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆయన చేస్తున్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజినీతో పాటు ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొందరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తుండగా తాజాగా మరొక యంగ్ భామను తీసుకున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఆమె పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే పూజా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటిస్తుందా లేక ఏదైనా ముఖ్య పాత్రలో నటిస్తుందా అని తెలియాల్సి ఉంది.

Did that director change the route Star heroine entry into the movie

అయితే ఇప్పుడు ఈ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా లోకేష్ సినిమాలు అంటే.. హీరోయిన్ ఉండదు, రొమాంటిక్ సీన్లు, ఇరికించే కామెడీ ట్రాక్‌లు ఉండవు. కేవలం కథ మీదే మూవీ సాగుతుంది. కానీ లోకేష్ స్టార్ డమ్ ని మనసులో పెట్టుకొని తీసిన మాస్టర్, లియో సినిమాలు ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయాయి. హీరో కోసం ఎలివేషన్స్, సీన్లు రాసినందుకే అలా జరిగిందని లోకేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడతారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు కూలీ కోసం లోకేష్ తన ట్రాక్‌ను మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. శృతి హాసన్ ఉండగా మళ్లీ పూజా హెగ్డేను తీసుకోవడంపై చర్చ జరుగుతోంది. దీంతో లోకేష్ ట్రాక్ మార్చాడా? అని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. చూడాలి మరి లోకేష్ ఏం ప్లాన్ చేశాడో అని.

మరోవైపు రజినీ కాంత్ ఇటీవల నటించిన సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న లోకేష్ అయినా.. సూపర్ స్టార్ కి మళ్లీ సక్సెస్ అందిస్తాడని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+