అల్లు అర్జున్‌కు ఆ పిచ్చి ఎక్కువ: స్టార్ డైరెక్టర్

రోజురోజుకు అల్లు అర్జున్ మధ్య, మెగా అభిమానుల మధ్య దూరం పెరిగిపోతోంది. గతంలోనే దీనికి బీజం పడినప్పటికీ ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ తీసుకున్న వైఖరి మరింత దూరం పెంచింది. పవన్ కల్యాణ్ కు మెగా కుటుంబ సభ్యులంతా పిఠాపురం వెళ్లి మద్దతు ప్రకటించారు. అయితే బన్నీ మాత్రం ట్వీట్ తో సరిపెట్టారు. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా మరో ట్వీట్ చేశాడు. ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలియజేయడంతో బన్నీకి, మెగా కుటుంబ సభ్యులకు దూరం పెరిగింది.

భారీగా ఖర్చుపెడతాడు
అదే సమయంలో నాగబాబు కూడా పరాయివాడే అంటూ ట్వీట్ చేయడంతో పాటు సాయిదుర్గా తేజ్ సామాజిక మాధ్యమాల్లో బన్నీని, స్నేహారెడ్డిని అన్ ఫాలో చేయడంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా దర్శకుడు గీతాకృష్ణ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతనికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువని, పబ్లిసిటీ కోసం ఎంత దూరమైనా వెళతాడని, ఎంత డబ్బైనా ఖర్చుపెడతాడని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో అతన్ని పొడిగితే విపరీతమైన ఇష్టమని, అతని దగ్గర ఓ ఆర్మీ ఉందని, దానిపై చాలా ఖర్చు చేస్తాడన్నారు.

director geethakrishna sensational comments on allu arjun

దక్షిణాదిలో ఇకపై బన్నీకి కష్టమే
ఆ విధంగా లక్షలాది రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చుచేస్తుంటాడని, వారంతా బన్నీ గురించే భజన చేస్తుంటారని, డబ్బుల్లేకుండా పవన్ కల్యాణ్ ను చూడటానికి ఎంతమంది వస్తారో.. అందులో సగం మంది అల్లు అర్జున్ ను చూడటానికి వస్తారని గీతాకృష్ణ తెలిపారు.

పుష్ప సినిమా హిట్ అయిన తర్వాత జాతీయ అవార్డు రావడం వల్ల అతన్ని చూడటానికి చాలామంది వస్తారని, ఆ విషయం తెలుసు కాబట్టే ప్రచార యావ ఎక్కువవని, ఆయన టైం బ్యాడ్ గా ఉంది కాబట్టి సినిమా పరంగా అందరికీ నెగెటివ్ గా మారిపోయాడన్నారు. ఉత్తరాదిలో ఈ మార్కెట్ ఉపయోగపడుతున్నప్పటికీ దక్షిణ భారతదేశంలో మాత్రం కెరీర్ ఉంటుందని తాను అనుకోవడంలేదని గీతాకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+