రామ్ చరణ్ లోకల్ , మహేష్ బాబు ఇంటర్నేషనల్.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్

దర్శకుడు కృష్ణవంశీ అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో కృష్ణవంశీ అంటే తెలియని సినీ అభిమాని ఉండరు. ఆయన తీసిన తొలి సినిమా గులాబితోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సింధురం సినిమాతో మరోసారి మ్యాజిక్ చేశారు. దీంతో కృష్ణవంశీ కంటూ ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఏర్పడింది. నిన్నే పెళ్లాడతా సినిమాతో కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి.

ఆ తర్వాత అంతఃపురం ,మురారి, ఖడ్గం,చందమామ సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారాయన.అయితే గత కొద్దికాలంగా కృష్ణవంశీ తన మార్క్ చూపించలేపోతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుకు ఎలాగైనా హిట్ ఇవ్వాలనే కసితోనే మురారి సినిమా చేసినట్టు కృష్ణవంశీ తెలిపారు.

director krishna vamsi interesting comments on mahesh babu and ram charan

ఆయన డైరెక్టర్ల ఆర్టిస్ట్‌ని కితాబిచ్చారు. ఎన్టీఆర్ రాఖీ సినిమా చేసిన కృష్ణవంశీ, ఎన్టీఆర్ లాంటి నటుడు ఇండస్ట్రీలో లేరని తెలిపారు. ఒన్ టెక్ ఆర్టిస్ట్‌గా ఎన్టీఆర్‌ను అభివర్ణించారు. రామ్ చరణ్ కోసం నా దగ్గర అద్భుతమైన కథ ఉందని, ఆయన ఓకే అంటే సినిమా చేస్తానని కృష్ణవంశీ తెలిపారు. మహేష్ బాబుతో సినిమా ఎప్పుడుంటుందని అడిగిన ప్రశ్నకు.. మహేష్ బాబు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్‌ని ,ఆయనతో మనం సినిమాలు చేసే రేంజ్ ఉందా అంటూ కామెంట్స్ చేశారు. అయితే ప్యాన్ ఇండియా సినిమాల్లో నటించిన రామ్ చరణ్‌ను లోకల్ స్టార్‌గానూ. ఒక్క ప్యాన్ ఇండియా మూవీ చేయని మహేష్ బాబును ఇంటర్నేషనల్ స్టార్‌గా పోల్చడంపై మెగా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+