ప్రభాస్ "స్పిరిట్" విలన్ ఎవరో రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగా..!
"సందీప్ రెడ్డి వంగా".. టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక కల్ట్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రాన్ని హిందీలో "కబీర్ సింగ్" గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక రీసెంట్ గానే స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో "యానిమల్" చిత్రాన్ని తెరకెక్కించి రికార్డులు తిరగరాశాడు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో "స్పిరిట్" సినిమా చేయనున్నారు.
పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రపరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే.. హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆమె కండిషన్స్ కారణంగా ఆ స్థానంలో.. ప్రభాస్ కి జోడీగా యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరూ మరోసారి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడం కన్ఫార్మ్ అని భావిస్తున్నారు.
స్పిరిట్ మూవీలో విలన్?
అయితే ఈ చిత్రంలో విలన్ గా ఎవరు నటించనున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. కొరియన్ యాక్టర్ "డాన్ లీ" ఈ మూవీలో యాక్ట్ చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ విషయంలో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు సందీప్ రెడ్డి.
రీసెంట్ గానే ఒక ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ మూవీ విలన్ ఎవరు? అంటూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు వ్యక్తం అయ్యాయి. దీంతో స్పిరిట్ మూవీలో "నేనే విలన్" అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు సందీప్ రెడ్డి వంగ. నిజంగానే సందీప్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారా? లేక కామెడీ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు మారుతితో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తుండగా.. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications