జానీ మాస్టర్ కేసులో సుకుమార్ ఇరుక్కున్నారా..?
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పని చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.
తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్‌లో యువతి ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ భార్య అయేషా సైతం రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు రోజులు పాటు పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగిన జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులు ఆయన్ను నేరుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

అయితే జానీ మాస్టర్‌ను విచారించేందుకు నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ వేయగా జానీ మాస్టర్‌కు 4 రోజుల కస్టడీకి అనుమతించింది. కస్టడీలో జానీ మాస్టర్ కీలక విషయాలను వెల్లడించారని తెలుస్తోంది. బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి ట్యాలెంట్‌ను చూసి మాత్రమే తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.ఆ అమ్మాయి విషయంలో తాను పడుతున్న ఇబ్బంది గురించి డైరెక్టర్ సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు జానీ తెలిపినట్టు సమాచారం. అయితే.. ఆమెను పిలిచి సుకుమార్ మాట్లాడారని.. అయినా సరే ఆమెలో ఎలాంటి మార్పు లేదని జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
అయితే వాస్తవానికి పుష్ప-2 సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జానీ మాస్టర్ అక్కడకు వెళ్లి బాధితురాలితో గొడపడినట్టు తెలుస్తోంది. గొడవ పెద్దది కావడంతో వీరిద్దర్ని దర్శకుడు సుకుమార్ పిలిచించి మాట్లాడినట్టు చెబుతున్నారు. వారిద్దర్ని రాజీ చేసుకోవాలని సుకుమార్ సూచించారట. కుదరకపోతే మీ పని మీరు చేసుకోండని.. అంతే కానీ ఇలా రోడ్డున పని అల్లరి కావొద్దంటూ వారిని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అయినా తీరు మార్చుకొని జానీ మాస్టర్ ఆ మహిళా కొరియోగ్రాఫర్‌ను వేధిస్తూనే ఉన్నారు. దీంతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో అనూహ్యంగా సుకుమార్ పేరు తెర మీదకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
-
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications