అల్లు అర్జున్‌కు భారీ షాక్ ఇచ్చిన మరో స్టార్ డైరెక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. డిసెంబరు ఆరోతేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మైత్రీ మూవీస్ దీన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక కాగా, ఫాహద్ ఫజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈనెల ఆగస్టు 15వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానుల ఉన్న గొడవ కారణంతో డిసెంబరు ఆరుకు వాయిదా వేసుకున్నారు.
రజనీ, సల్మాన్ సినిమాను ప్రకటించిన అట్లీ
ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని బన్నీ, అట్లీ చర్చలు జరిపారు. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా తీయాలని భావించారు. అయితే చివరి నిముషంలో రూ.80 కోట్ల పారితోషికాన్ని దర్శకుడు అడగడంతో ప్రాజెక్టు రద్దయింది. చివరకు అట్లీ సల్మాన్, రజనీకాంత్ తో సినిమా ప్రకటించాడు. అట్లీతో సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో పాన్ ఇండియా సినిమా తీసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. సినిమా బడ్జెట్ కూడా భారీగా అవుతుందని అంచనా వేశారు. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక వార్త రాలేదు.

నాలుగేళ్ల సమయం పడుతుందన్న సందీప్
కాల్షీట్లను సర్దుబాటు చేసుకొని సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే సందీప్ ఇటీవలే మాట్లాడుతూ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నానని, దానికి రెండు సంవత్సరాల సమయం పడుతుందని, దీనితర్వాత యానిమల్ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నానని, యానిమల్ పార్క్ పూర్తికావడానికి మరో రెండు సంవత్సరాల సమయం పడుతుందని, మొత్తగా నాలుగు సంవత్సరాలు తనకు ఖాళీలేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశాడు. దీంతో అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి చేయాల్సిన సినిమా కూడా రద్దయిందని వార్తలు వస్తున్నాయి. పుష్ప తర్వాత అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కరే అవకాశంగా కనపడుతున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications