లావణ్య త్రిపాఠికి దూరంగా ఉంటున్న వరుణ్‌తేజ్?

యంగ్ హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఆరు సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వివాహమైన తర్వాత కూడా అవకాశాలు వస్తుంటే సినిమాలు చేయాలా? వద్దా? అని భర్తతోపాటు నాగబాబు దంపతులను కూడా లావణ్య అనుమతి అడిగించింది. వారంతా ఆమె ఇష్టానికే వదిలిపెట్టారు. తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే సినిమాలకన్నా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచనలో లావణ్య త్రిపాఠి ఉంది. వరుణ్ తేజ్ ఇటీవల నటించిన సినిమాలన్నీ పరాజయం పాలవుతుండటంతో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.

కొరియాలో ఒకే షెడ్యూల్
ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు మరో రెండు సినిమాలను ఒప్పుకోగా అందులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ సొంత బ్యానర్ ఇది. ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించబోతున్నారు మేర్లపాక గాంధీ. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వరుణ్ కొరియా వెళుతున్నారు. సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్ లో అక్కడే సినిమాను గాంధీ ముగించబోతున్నారు.

distance between mega hero varuntej and his wife lavanya tripathi

అమెరికాలో వరుణ్ తేజ్
ఈ సినిమాతోపాటు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి వరుణ్ ఒప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ కూడా అమెరికాలో జరగబోతోంది. మేర్లపాక గాంధీ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇలా వరుసగా రెండు సినిమాల షూటింగ్స్ కోసం ఎక్కువ కాలం వరుణ్ విదేశాల్లో ఉండబోతున్నాడు. వివాహమైన తర్వాత తొలిసారిగా లావణ్య త్రిపాఠిని వదిలిపెట్టి చాలాకాలం సినిమాల కోసం దూరంగా ఉండబోతున్నాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో లావణ్యకు వరుణ్ దూరంగా ఉండబోతున్నాడనే వార్త వైరలవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+