‘పోకిరి’ సినిమాను వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఆరోజుల్లోనే రూ.70 కోట్ల గ్రాస్ వసూల్లు రాబట్టి ఔరా అనిపించింది. అంతేకాదు.. రూ.40 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని విడుదలకు ముందే సూపర్ స్టార్ కృష్ణ చెప్పారు. ఆయన చెప్పినట్లుగా పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. పోకిరి సినిమాతో మహేష్ బాబు స్టార్ డమ్ పదిలమైంది. పూరీ జగన్నాథ్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఇలియానా కథానాయికగా నటించగా, ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే, నాజర్, సుధ, మాస్టర్ భరత్ తదితరులు నటించారు. మణిశర్మ అద్భుతమైన స్వరాలనందించారు.

ఆ బ్యాగ్రౌండ్ ను తీసేయమన్న మహేష్ బాబు
ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు పూరీ ముందుగా రవితేజతో , లేదంటే పవన్ కల్యాణ్ తో తీద్దామనుకున్నారు. బద్రి సినిమాకు ముందే పూరీ ఈ కథను సిద్ధం చేసుకున్నారు. సినిమా పేరు కూడా ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అనుకున్నారు. పంజాబ్ బ్యాగ్రౌండ్ లో సినిమా ఉంటుంది. అదే సమయంలో రవితేజకు నా ఆటోగ్రాఫ్ సినిమా చేసే అవకాశం వచ్చింది. దీంతో రవితేజ ఈ సినిమావైపు మొగ్గుచూపారు. పవన్ కల్యాణ్ కు ఖాళీ లేకపోవడంతో చివరకు ఈ కథ మహేష్ బాబు దగ్గరకు చేరగా ఆయన ఒక సూచన చేశారు. పంజాబ్ బ్యాగ్రౌండ్ తీసేసి మనకు స్థానికంగా ఉండే బ్యాగ్రౌండ్ నే వాడదామన్నారు. దీంతో హైదరాబాద్ బ్యాగ్రౌండ్ గా సినిమా వచ్చింది.

Do you know which star heroes have given up on the movie Pokiri

వారిద్దరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయ్యారు
హీరోయిన్ గా ఆయేషా టకియా అనుకున్నారు. అయితే ఆమె ఈ సినిమాను వదులుకోవడంతో కంగనా రనౌత్ ను తీసుకుందామనుకున్నారు. గ్యాంగ్ స్టర్ సినిమా ఆడిషన్స్ జరిగే సమయంలోనే పోకిరి ఆడిషన్స్ కూడా జరగడంతో ఆమె గ్యాంగ్ స్టర్ వైపు మొగ్గుచూపింది. దీంతో చివరకు ఇలియానాను ఎంపిక చేశారు. ఈ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. రవితేజతోకానీ, పవన్ కల్యాణ్ తోకానీ సినిమా తీస్తే నిర్మాతగా నాగబాబును అనుకున్నారు. కానీ చివరకు నాగబాబుకు కూడా ఆ అవకాశం చేజారింది. ఒకానొక దశలో సోనూసూద్ హీరోగా సినిమా తీద్దామని పూరీ అనుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర లెక్కలు సరిగా ఉండవేమో అనే ఉద్దేశంతో వద్దనుకున్నారు. చివరకు పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+