చిరంజీవి సినిమా వల్ల మా బతుకులు నాశనం
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో ఫెయిల్ అయిన చిరంజీవి, తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు.
10 ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో నటించినప్పటికీ తన స్టామినా ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపించారు. ఆరు పదుల వయస్సులో కూడా ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇక చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో 'ఠాగూర్' కూడా ఒకటి. ఈ సినిమాకంటూ సపరేటు ఫ్యాన్స్ ఉంటారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి. ఈ సినిమాలో హాస్పిటల్ సీన్ వల్ల డాక్టర్లంటే డబ్బు మనుషులుగా చూస్తున్నారని ఆయన తెలిపారు. డాక్టర్లని ఆ సన్నివేశంలో అత్యంత దారుణంగా చూపించారని గురవారెడ్డి చెప్పుకొచ్చారు.'ఆ సీన్ ఎవరు రాశారో తెలీదు గానీ దీని వల్ల వైద్య వృత్తికి చాలా నష్టం చేకూరిందని ఆయన తెలిపారు.

ఈ సినిమా తర్వాత ఎవరైనా సరే పేషెంట్స్‌ని డబ్బుల కోసమే డాక్టర్లు ఐసీయూలోకి తీసుకెళ్తారని అనుకుంటారు. పొరపాటున పేషెంట్ చనిపోతే, దానికి తాము కారణం కాదని వైద్యులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి నాకు సన్నిహితుడే, ఆయన్ను కలిసినప్పుడు ఈ సీన్ గురించి చర్చించానని డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. అయితే ఈ సీన్ ఇంకా దారుణంగా ఉందని, దాన్ని తానే మార్చానని చిరంజీవి తనతో చెప్పినట్టుగా డాక్టర్ గురవారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications