తాగుదాం.. షూటింగ్ చేద్దాం! మళ్లీ జతకట్టిన హిట్ కాంబినేషన్!!
టాలీవుడ్ యూత్ ఫుల్ క్లాసిక్ 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ఈ నగరానికి ఏమైంది 2 రిపీట్' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విశ్వక్ సేన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ థాయ్‌లాండ్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించబడుతోంది.
వైరల్‌గా మారిన బిహైండ్ ది సీన్స్ ఫోటో
తాజాగా ఈ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫోటోను విడుదల చేసింది. ఇందులో "టీమ్ కన్యారాశి"గా పిలవబడే అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ఓ నీలిరంగు కన్వర్టబుల్ కార్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, సరదా చూస్తుంటే.. మొదటి భాగంలో ఉన్న అదే మ్యాజిక్ ఈ సీక్వెల్‌లో కూడా రిపీట్ కాబోతోందని అర్థమవుతోంది.

మళ్లీ అదే మ్యాజిక్.. వివేక సాగర్ సంగీతం
ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగంలో ఆయన అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసింద. ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం కూడా ఆయన ఓ అదిరిపోయే ఆల్బమ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతోంది.
ప్రేక్షకుకులో పెరిగిన అంచనాలు
'ఈ నగరానికి ఏమైంది' సినిమా టాలీవుడ్ యూత్, ఫ్రెండ్‌షిప్ బేస్డ్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే గ్యాంగ్ మళ్లీ స్క్రీన్ మీద కనిపించబోతుండటంతో అభిమానులలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. థాయ్‌లాండ్ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ ఇతర అప్‌డేట్‌లను పంచుకోనుంది.












Click it and Unblock the Notifications