18 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ ముందుకు 'ఓజీ' విలన్.. ఆ సినిమాతో
బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఈరోజు తన 46వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇమ్రాన్ హష్మీ అనగానే మనకు ఆయన ఇంటెన్స్ యాక్టింగ్ మాత్రమే గుర్తొస్తుంది. ఇమ్రాన్ హష్మీ 2003లో ఫుట్‌పాత్ సినిమాతో బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశారు. కలియుగ్ (2005), అక్సర్ (2006), గ్యాంగ్‌స్టర్: ఎ లవ్ స్టోరీ (2006), జన్నత్ (2008), రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్ (2009), మర్డర్ 2 (2011), ది డర్టీ పిక్చర్ (2011), జన్నత్ 2 (2012), మరియు రాజ్ 3 (2012) లాంటి పలు సినిమాల్లో తన నటనతో మెప్పించారు.
అయితే సోషల్ మీడియాకు ఇమ్రాన్ హష్మీ దూరంగా ఉంటారు. తన సినిమాలు ఏమైనా ఉంటేనే ప్రొమోషన్స్ కు బయట కనిపిస్తారు. లేకపోతే ఎక్కువ సమయం ఫ్యామిలీతోనే ఉంటారు. ఇక ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ 2025 లో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ ఎవేయిటెడ్ మూవీ OG (దే కాల్ హిమ్ OG) ఒకటి. ఈ చిత్రంతోనే ఆయన టాలీవుడ్ లోకి గ్రాండ్ గా అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమాకు సుజీత్ రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇమ్రాన్.. ఓమి భావు పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దీంతోపాటు.. తేజస్ విజయ్ డియోస్కర్ దర్శకత్వం వహించిన 'గ్రౌండ్ జీరో' సినిమాలోనూ ఇమ్రాన్ నటిస్తున్నారు. ఇది కాకుండా ఇమ్రాన్.. మరో తెలుగు చిత్రంలోనూ కనిపించనున్నారు. అదే అడివి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.
అయితే తాజాగా ఇమ్రాన్ హష్మీ.. తన ఫ్యాన్స్ ను గ్రీట్ చేశారు. తన 46వ బర్త్ డే సందర్భంగా కొత్త చిత్రం 'ఆవారాపాన్- 2' ను ప్రకటించారు. ఈ మూవీ 2007లో రిలీజైంది. అయితే ఈ మూవీకి కొనసాగింపుగా పార్ట్ 2 ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఇమ్రాన్ హష్మీ తెలిపారు. ఈ మూవీని ఏప్రిల్ 2026లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కొంచెం లేట్ అయింది కదూ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇమ్రాన్.. 18 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ ముందుకు వచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications