ఓటీటీలోకి ఈ వారం మూడు బ్లాక్ బస్టర్ మూవీస్
ఉచితంగా సరికొత్త కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్‌కి సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను పంచుతోంది నయా ఓటీటీ ఫ్లాట్‌ఫాం థియేటర్ ప్లస్. డిఫరెంట్ జానర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ, ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఫీజు లేదా ఎలాంటి పేమెంట్స్ లేకుండా ఈ వారం మూడు భిన్నమైన చిత్రాలను ఉచితంగా స్ట్రీమింగ్కు తీసుకువస్తోంది. థియేటర్లలో అలరించిన ఈ మూడు చిత్రాల విశేషాలు ఇవే..
గుమాస్తా
న్యాయవ్యవస్థ, చట్టంలోని లూప్‌హోల్స్ నేపథ్యంలో సాగే తీవ్రమైన క్రైమ్ డ్రామా ఇది.చట్టాలలోని మెలికలన్నీ తెలిసిన ఒక లాయర్ క్లర్క్, తన భార్య అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ముద్దాయిగా మారతాడు. పోలీసులకు, నిందితుడికి మధ్య పిల్లి-ఎలుకలా సాగే ఈ విచారణ ఆట ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది. కథ చివరకు వచ్చేసరికి రివీల్ అయ్యే ఊహించని ట్విస్ట్‌లు, మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి.

నాలుగు వసంతాలు
ప్రేమలోని మాధుర్యాన్ని, విరహంలోని బాధను ఎంతో అందంగా తెరకెక్కించిన లవ్ స్టోరీ. నాలుగేళ్ల కాలేజీ ప్రయాణంలో సాగే ఒక ప్రేమికుల కథ, వారి బ్రేకప్ ఆధారంగా ఈ చిత్రం నడుస్తుంది.కాలేజీ జీవితం ముగిసే సమయానికి వీరి ప్రేమ కథలో చోటుచేసుకునే నాటకీయ పరిణామాలు, హృదయానికి హత్తుకునే ట్విస్ట్ అండ్ టర్న్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. యూత్‌కు, ప్రేమకథలను ఆస్వాదించే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
జై గణేష్
ప్రతి నిమిషం నెయిల్ బైటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. ఒక చిన్న పిల్లాడి కిడ్నాప్ చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరుగుతుంది.కిడ్నాప్ మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆడియెన్స్‌ను సీటు అంచున కూర్చోబెడుతుంది. చివరికి నేరస్థుడిని పట్టుకునే విధానం, ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్‌లు థ్రిల్లర్ ప్రేమికులకు మంచి అనుభూతిని అందిస్తాయి. ఒకే వేదికపై న్యాయపోరాటం, ప్రేమకథ, కిడ్నాప్ థ్రిల్లర్ వంటి మూడు విభిన్నమైన కథలను అది కూడా రూపాయి ఖర్చు లేకుండా అందిస్తోంది థియేటర్ ప్లస్. ఈ వారం మీ వీకెండ్ వినోదానికి ఈ చిత్రాలు పర్ఫెక్ట్ ఆప్షన్.












Click it and Unblock the Notifications
