బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మాజీ కంటెస్టెంట్లు... ఎవ‌రో తెలుసా..?

తెలుగు బిగ్‏బాస్ సీజన్ 8 ప్రారంభ‌మ‌య్యి మూడు వారాలు అవుతుంది. ఇప్ప‌టికే ఇంటినుంచి ఇద్ద‌రూ కంటెస్టెంట్లు బ‌య‌టికి వ‌చ్చేసారు. ఇక‌, ఈ వారం మ‌రో కంటెస్టెంట్ బ‌య‌టికి వెళ్ల‌బోతున్నారు. అయితే, ఈ సీజ‌న్‌లో ఏడు జంట‌లు మాత్ర‌మే వ‌చ్చాయి. వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలో మాజీ కంటెస్టెంట్లు ఇంట్లోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్రస్తుతం నెట్టింట‌ వైరలవుతున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్‌బాస్ ఇంట్లోకి మాజీ కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇస్తున్నారు. వారితోపాటు కొత్త వారిని కూడా తీసుకువస్తున్నారని స‌మాచారం. ఇందులో నలుగురు కంటెస్టెంట్ల పేర్లు ఇప్ప‌టికే క‌న్ఫార్మ్ చేశారు. బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ హరితేజ. ఈసారి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

Ex contestants as wild card entry into Bigg Boss house do you know who

హ‌రితేజ బిగ్‌బాస్‌లో టాస్కుల విష‌యంలో కానీ, కామెడీ విష‌యంలో కానీ అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఈమెతో పాటు మ‌రో కంటెస్టెంట్ రోహిణి కూడా ఎంట్రీ ఇవ్వనుంద‌ట‌. రోహిణి టాస్కుల్లో పెద్ద యాక్టివ్‌గా క‌నిపించ‌క‌పోయినా, హౌస్‌లో మాత్ర‌మ కామెడీ బాగా పండించింది. వీరితోపాటు బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇంట్లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవినాష్ ఇంట్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు.

Ex contestants as wild card entry into Bigg Boss house do you know who

మ‌రికొంద‌రు..

వీరితోపాటు మరికొంత‌మంది కూడా ఇంట్లోకి ప్ర‌వేశించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అందులో బిగ్‌బాస్ సీజ‌న్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని మ‌రోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ట‌న‌. నయని పావని గ‌త సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే గతంలో బుల్లితెర న‌టి శోభా శెట్టిని కాపాడేందుకు నయనిని ఎలిమినేట్ చేశార‌ని అభిమానులు అప్ప‌డు ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి నయనిని హౌస్ లోకి తీసుకువస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, వీరితోపాటు బుల్లితెర న‌టి రీతూ చౌదరి, గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+