బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్'. అటు కామనర్స్.. ఇటు సెలబ్రిటీలతో కలిసి సాగుతున్న ఈ 9వ సీజన్‌లో 5వ వారం ఎలిమినేషన్ కి దగ్గరైంది. గత నాలుగు వారాల్లో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. వారిలో శ్రష్టి వర్మ, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, హరిత హరీష్ ఉన్నారు. బయటికి వెళ్లిన వారంతా కామనర్స్ అవ్వడంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని ఆద్యంతం ఆసక్తిగా మారింది.
కాగా ఉన్న కంటెస్టెంట్లలో ఇమ్మానుయేల్ వన్ మ్యాన్ షో తో రాణిస్తుంటే.. మిగిలిన వారిలో పవన్, డీమోన్ ఒకటే పనిలో ఉన్నట్టు జంటగా మారాలని చూస్తున్నారు. రీతూ చౌదరి, తనుజా కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే దొరికిపోతున్నారు. ఇక భరణి ఇంటి పెద్దగా మారి ఆసలు పని మానేసి ఇతరుల విషయాల్లో ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారు. ఇక సంజన ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమెకే తెలీదు. సుమన్ శెట్టి, శ్రీజ, దివ్య, ఫ్లోరా షైనీ వారి పనుల్లో వారు ఉంటున్నారు.

ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే..
ఈ వారం బిగ్‌బాస్ షోలో ఎన్నడూ లేని విధంగా అందర్నీ బిగ్‌బాస్ నామినేట్ చేశారు. పవన్, డిమోన్ పవన్, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య.. మొత్తం 11 మంది నామినేషన్స్‌లో నిలిచారు. అయితే టాస్కుల ద్వారా బాగా ఆడి ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్య, పవన్ నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. దాంతో రీతూ, తనూజ, డిమోన్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, సంజనా గల్రానీలు డేంజర్ జోన్‌లో నిలిచారు.
అయితే 5వ వారం ఓటింగ్‌లో తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి టాప్ స్థానాల్లో నిలువగా.. అతి తక్కువ ఓటింగ్‌తో ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, శ్రీజా దమ్ము ఉన్నారని సమాచారం. ఈ క్రమంలోనే అతి తక్కువ ఓటింగ్ తో ఫ్లోరా సైనీని ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తోంది. షో ప్రారంభం నుంచీ ఆటలో వేగం పెంచకపోవడం, హౌస్‌లో పెద్దగా కంటెంట్ ఇవ్వకపోవడం.. ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడం వంటి కారణాల వల్ల ఆమె బయటికి వచ్చేస్తున్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

కాగా మరోవైపు ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లు షో రేటింగ్‌ను పెంచడంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో.. నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీతో కొందరు సెలబ్రిటీలను ఇంట్లోకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఆ విధంగా ప్లాన్ చేస్తే రీతూ చౌదరీ, శ్రీజా దమ్ము లలో మరొకరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు.
ఇక ఆదివారం నాడు బిగ్‌బాస్ తెలుగు 9 షోలో 2.0 వెర్షన్ ప్రసారం కానుంది. ఈ వెర్షన్‌కు సంబంధించిన షూట్ ఈరోజు ( శనివారం ) పూర్తి చేయనున్నట్టు చెబుతున్నారు. సుమారుగా 2.30 గంటలపాటు ఈ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందని.. వైల్డ్ కార్డు ద్వారా ఆరుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది. వారిలో.. రమ్య మోక్ష ( అలేఖ్య చిట్టి పికెల్స్ ), దివ్వెల మాధురి, అయేషా జీనత్, శ్రీనివాస సాయి, నిఖిల్ నాయర్, గౌరభ్ గుప్త పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సీజన్ 9కి మళ్లీ కొత్త వస్తుందని.. అసలైన రణరంగం మొదలవుతుందని అనుకుంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications