మంత్రి కూతురిని 20 రోజులు ఇంట్లో ఉంచుకుని పంపించిన హీరో ఎవరో తెలుసా..?
సినిమా హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అందులో కొందరు హీరోలకు వీరాభిమానులు ఉంటారు. తమ ఇష్ట నటుడిని ప్రత్యక్షంగా చూడాలని, వారితో కలిసి మాట్లాడాలని పరితపిస్తుంటారు. ఇక కొందరి హీరోలకు లేడీ ఫ్యాన్స్ మరింత ప్రత్యేకమని చెప్పాలి. అభిమాన హీరోని కలవాలని తెగ ఆరాటపడుతుంటారు. అయితే ఓ లేడీ అభిమాని చేసిన పని అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇలాంటి ఓ లేడీ అభిమాని బాలీవుడ్ అగ్ర నటుడు గోవిందాను చూసేందుకు ఎంత పని గురించి ఆయన భార్య సునీత అహూజ వెల్లడించారు.
బాలీవుడ్‌లో హీరో గోవిందా క్రేజ్ గురించి ఈతరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో గోవిందా హీరోయిజం తెలియని సినీ అభిమాని ఉండేవారు కాదు. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ త్రయానికి పోటీగా సినిమాలు చేసేవారు గోవిందా. 1986లో విడుదలైన 'ఇల్జామ్' సినిమాతో సినీ కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ప్రజలను తన నటనలతో అభిమానులను ఆకట్టుకున్నారు. బాగా నవ్వించారు. ఆయన హాస్య శైలిని ఇష్టపడని అభిమాని ఉండడు అనేంతగా జనాల హృదయాలను దోచుకున్నారు.

వరుస హిట్లను సాధిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారాయన. అయితే ఆ తర్వాత గోవిందా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలకు దూరం అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎంపీగా విజయం సాధించారు. ఇదిలా ఉంటే గోవిందా అభిమానుల గురించి ఆయన భార్య సునీత అహూజ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అంకిత్ పాడ్‌కాస్ట్‌తో టైమ్‌అవుట్‌లో సునీత మాట్లాడుతూ గోవిందాకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెబుతూ..వివాహం అయిన కొత్తలో తమ ఇంటికి ఒక యువతి వచ్చిందని, పనిమనిషిగా చేరిన ఆమెకు గిన్నెలు తోమడం రాదని సునీత చెప్పారు.
కనీసం ఇల్లు కూడా శుభ్రం చేయడం రాదని, గోవిందాను చూసేందుకు ఆమె నిద్ర మానుకొని వేచిచూసేదని చెప్పారు. దాదాపు 20 రోజులు ఆమె తమతోనే ఉందని, అయితే ఆమె రూపు, ప్రవర్తన తీరు గమనిస్తే సంపన్నుల అమ్మాయిలా కనిపించిందని, చివరికి ఆమె ఒక మంత్రి కూతురు అని తెలిసిందని సునీత వెల్లడించారు. ఆ అమ్మాయి ఎంత ఆలస్యమైనా మెలకువగా ఉండి గోవిందా కోసం ఎదురు చూసేదట.
అది చూసిన సునిత ఆ అమ్మాయి గురించి ఆరాతీసిందని చెప్పారు. ఆ తరువాత ఆ అమ్మాయిని గట్టిగా అడిగితే తమ ముందు కన్నీళ్లు పెట్టుకుని, తాను గోవిందా అభిమానిని అని, తాను ఒక మినిస్టర్ కూతురిని అని చెప్పింది. తర్వాత ఆమె తండ్రి నాలుగు వాహనాలతో వచ్చి ఆమెను తీసుకెళ్లాడని చెప్పారు. ఇక గోవిందా సినిమాల విషయానికొస్తే.. ఆయన చివరిసారిగా 'రంగీలా రాజా' అనే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం 2019 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 19 లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ ఫ్లాప్ సినిమా తర్వాత గోవిందా ఏ చిత్రంలో కనిపించలేదు. రాజకీయాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications