గుంటూరు కారం కాపీ మూవీనా: గురూజీ ఏదైనా చేయగల సమర్థుడు
Guntur kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా టీజర్.. సినిమా సత్తాను చాటింది. మహేష్ బాబు స్టామీనాను నిరూపించింది. ఆయనలోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. తలకు ఎర్ర టవల్, నోట్లు బీడీ, మాసిన గెడ్డం, గళ్ల చొక్కాతో క్రేజ్ కా బాప్ అనిపించాడు ప్రిన్స్. మాస్ లుక్స్‌తో కనిపించారు మహేష్ బాబు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నారాయన.

డాన్స్, ఫైట్స్‌లో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. గుంటూరు కారం పోస్టర్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసేలా చేస్తోన్నాయి. సర్కారువారి పాట బ్లాక్ బస్టర్, మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో మూవీ ఇదే కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
గడువు సమీపిస్తోండటంతో.. విడుదల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. థియేటర్లను ఇదివరకే బుక్ చేసుకున్నారు నిర్మాతలు. నైజాం ఏరియా హక్కులను మైత్రీ మూవీస్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడంపైనా నిర్మాతలు దృష్టి పెట్టారు. ఏపీలో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్లల్లో టికెట్ ఒక్కింటిపై 75 రూపాయలు, తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లల్లో ఒక్కో టికెట్‌పై 65, మల్టీ ప్లెక్స్‌లల్లో 100 రూపాయల మేర పెంచుకోవడానికి అనుమతులను కోరారు.
ఈ పరిస్థితుల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా తీశారనే టాక్ వినిపిస్తోంది. యద్దనపూడి సులోచనరాణి రాసిన నవల- కీర్తి కిరీటాలు. ఒక సంగీత కళాకారిణి జీవితంలో తలెత్తిన సమస్యలను కథానాయకుడు ఏ రకంగా పరిష్కరించాడనేది ఈ నవల ఇతివృత్తం. దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది.
He can do anything and get away with it - and there is privileged blindness which people would have for his wrong doings - always wondered why he had such exclusive CMs office for the earlier govt - which general public did not have to resolve their issues - #guruji things ! https://t.co/YbTFPo4SNH
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2024
ఆ నవలనే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో తెరకెక్కించారని చెబుతున్నారు. దీనిపై ఓ వెబ్‌సైట్ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌కు ప్రముఖ నటి పూనమ్ కౌర్ రిప్లై ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పరోక్షంగా త్రివిక్రమ్‌పై సెటైర్లు వేశారామె. త్రివిక్రమ్‌ను గురూజీ అని సంబోధించారు.
ఆయన ఏదైనా చేయగల సమర్థుడని, అందులో నుంచి అంతే సామర్థ్యంతో బయటపడగలడని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించారు. ఆయన తప్పుడు పనులకు ప్రత్యేకంగా ముసుగు వేయగలుగుతారని, దీన్ని జనం చూడలేరని అన్నారు. గత ప్రభుత్వాల సీఎంల కార్యాలయాలకు- ప్రత్యేక అనుబంధం ఎలా ఏర్పడిందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications