ఆనందంలో నందమూరి ఫ్యాన్స్.. అబ్బాయి నోట బాబాయ్ మాట.. ఇక కలిసినట్టేనా ?
నందమూరి కుటుంబంలో బాబాయ్ - అబ్బాయిల మధ్య గ్యాప్ వచ్చిందని గత కొంతకాలంగా ఓపెన్ గానే డిస్కషన్ నడుస్తోంది. అప్పుడెప్పుడే బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ లో కలసి కనిపించారు. మళ్లీ ఆ తర్వాత నుంచి బాలయ్య - ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి కనిపించలేదు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో సైతం ఎడమొహం, పెడమొహం గానే ఉన్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ బాగున్నారు కానీ.. వారితో బాలయ్య మంచిగా ఉండడం లేదని.. దూరం పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలానే రీసెంట్ గా బాలయ్య సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సైతం వీళ్ళు పాల్గొనకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా నందమూరి అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పాడు కళ్యాణ్ రామ్.

రీసెంట్ గానే బింబిసార సినిమాతో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం "అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కళ్యాణ్ రామ్ కి తల్లిగా నటిస్తున్నారు. మళ్లీ చాలా కాలం తర్వాత పోలీస్ పాత్రలో ఆమె నటిస్తుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు బాబాయ్ బాలకృష్ణతో కలిసి బాల గోపాలుడు చిత్రంలో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బాబాయ్ నుంచి నటనలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. బాల బాబాయ్ ఎప్పుడూ తనకు స్ఫూర్తి అని.. ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమపై ఉందన్నారు. ఇక చాలా కాలమ తర్వాత కళ్యాణ్ రామ్ బాలయ్య గురించి మాట్లాడడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
అలానే విజయశాంతితో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని కళ్యాణ్ రామ్ వ్యాఖ్యానించారు. కర్తవ్యం సినిమాలో పవర్ ఫుల్ నటనను మళ్లీ ఈ సినిమా గుర్తు చేస్తుందని తెలిపారు. ఆమె ఎనర్జీ, కమిట్‌మెంట్ సెట్‌లో అందరికీ స్ఫూర్తిగా నిలిచాయన్నారు. కర్తవ్యం సినిమాలో అమ్మ క్యారెక్టర్ కి కొడుకు ఉంటే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా అని.. అందరికీ తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. అతనొక్కడే సినిమా లాగానే ఈ చిత్రం కూడా చాలా కాలం గుర్తుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications