కాంగ్రెస్ దెబ్బకు అడ్డంగా బుక్ అయిన రష్మిక మందన్న
హీరోయిన్స్ రష్మిక మరోసారి ట్రోలింగ్ గురయ్యారు. గతంలో ఆమె బీజేపీకి అనుకూలంగా చేసిన ట్వీట్ ఇప్పుడు ఆమెకు శాపంగా మారింది. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ను వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను అటల్ సేతు బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. ఈ అటుల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ప్రశంసలు కురిపించింది. అటల్ సేతుపై కారులో ప్రయాణిస్తూ దాని గురించి తాను మాట్లాడుతున్న వీడియోను రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భారత్.. ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరని, అసాధ్యం అనుకున్న దాన్ని ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం చేశారని రష్మిక ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వంతెనపై ప్రయాణం ఓ మధురానుభూతిని ఇస్తుందని, వికాసిత భారత్‌కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోందని వ్యాఖ్యానించింది. అయితే తాజాగా ఈ అటల్ సేతు బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ఆ పగుళ్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన్నపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

ఇప్పడు కూడా వీడియోలు చేయాలని, రష్మిక ఎక్కడ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదే సమయంలో ఆమెకు ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు.. రష్మికను అనడం ఏంటని రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే..గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.












Click it and Unblock the Notifications