నా జీవితం.. నా ఇష్టం.. నీకెందుకు?

ఈ మధ్య కాలంలో హీరోయిన్ సమంత పాపులర్ అయినట్లుగా ఏ హీరోయిన్ అవలేదని చెప్పొచ్చు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత పాపులారిటీ పెరిగింది. మయోసైటిస్ కు చికిత్స తీసుకోవడం కోసం ఏడాదిపాటు సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం కథలను వింటోంది. ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా గత నెల 28వ తేదీన సమంత తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే.

తన పుట్టినరోజు వేడుకలను ఎక్కడ నిర్వహించుకుంది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఏథెన్స్ లో తాను తిరిగిన ప్రదేశాలు, తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన అన్ని ఫొటోలను షేర్ చేసింది.

heroine samantha birthday celebrations in athens

సమంత ఎంతో సంతోషంగా, జాలీగా అక్కడ వీధుల్లో చక్కర్లు కొడుతూ తిరిగింది. తన జీవితం తన ఇష్టమొచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తానని, మధ్యలో విమర్శలు చేసేవారిని మీకెందుకు? అని ప్రశ్నించినట్లుగా ఉంటోందని నెటిజన్లు అంటున్నారు. తన లైఫ్ స్టైల్ గురించి ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోదని ఆ ఫొటోలు చూస్తుంటే అర్థమవుతోంది.

ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే తాజాగా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా సమంత ఎంపికైంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ దళపతి నటిస్తున్న చివరి సినిమాలోను సమంత హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.

heroine samantha birthday celebrations in athens

ప్రస్తుతం ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత, నాగచైతన్య అభిమానులు మాత్రం వీరిద్దరూ మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నారు. చిన్న చిన్న మనస్పర్థలవల్లే విడిపోయారని, ఇప్పటికీ వీరికి ఒకరిపై మరొకరంటే చెప్పలేనంత ప్రేమ ఉందని, కలిసిపోవాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+