ఆవేశంలో జరిగిపోయాయి.. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు: సమంత
అందాల ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. దీంతోపాటు బాలీవుడ్ లో చేసిన హన్నీబన్నీ వెబ్ సిరీస్ విడుదలకు సిద్దమవుతోంది. ఏడాదిన్నర సమయం నుంచి సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉన్నప్పటికీ తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా విడుదల చేసిన బాలీవుడ్ ఆర్మాక్స్ మీడియా సంస్థ సర్వేలో తను మొదటి స్థానంలో నిలిచింది. సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనకు విజయాల శాతం ఎక్కువ. అధిక శాతం సినిమాలు విజయాలు సాధించడంతో దర్శక, నిర్మాతలకు ఆమెకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
వెనుతిరిగి చూసినా ఉపయోగం ఉండదు
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. మన జీవితంలో కొన్ని విషయాలను నేర్చుకోవాలని, మరికొన్నింటిని మార్చుకోవాలని అందరూ భావిస్తారని, జీవితంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు అయ్యో.. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటామని సమంత చెప్పింది. అవి జరిగిపోయిన తర్వాత మార్చుకోవాలన్నా వీలుకాదని, ప్రస్తుతం వెనుతిరిగి చూసుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.

కష్టాలను ఎదుర్కొంటనేనే జీవితాన్ని గెలిచినట్లు
ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు అవుతుందని, జరిగిపోయిన గతంతో పోలిస్తే తాను ఎంతో ధైర్యంగా సమస్యలపై పోరాడానన్నారు. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడానికి అగ్నిగుండం లాంటి సమస్యలను కూడా అధిగమించానని చెప్పారు. దీంతో సమంత మాట్లాడిన మాటలన్నీ విడాకుల గురించే అని అందరికీ అర్థమైంది. నాగచైతన్యను ఏడు సంవత్సరాలు ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాల కాపురం చేసిన తర్వాత విడిపోయారు. సినీ పరిశ్రమలో ఈ సంఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. అన్యోన్యంగా, చూడముచ్చటగా ఉన్న ఈ జంట విడిపోతారని ఎవరూ అనుకోలేదు. అక్కినేని అభిమానులైతే తిరిగి వీరిద్దరూ కలిసిపోవాలని కోరుకుంటున్నారు. విడాకులైన తర్వాత నాగచైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా బహిరంగంగా ఈ సంఘటన గురించి వ్యాఖ్యానించలేదు.












Click it and Unblock the Notifications