50 ఏళ్ల నష్టపరిహారం కట్టండి- ట్రంప్ ప్రతిపాదన: అనూహ్య మలుపు

అమెరికా, ఇరాన్‌ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న దౌత్య, సైనికపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు నూతన మలుపు తిరిగాయి. భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య జరగబోయే ఎలాంటి శాంతి చర్చల్లోనైనా ఇరాన్ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ అండదండలతో దశాబ్దాలుగా జరిగిన వివిధ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తమ దేశానికి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలనే ప్రతిపాదన తెర మీదికి తెచ్చారు.

ఇటీవలి కాలంలో జరిగిన యుద్ధ నష్టాలకు అమెరికా తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు స్పందించారు. ఇరాన్ వైఖరిని తప్పుపట్టారు. ఇరాన్ పరిహారం అడిగితే, తాము కూడా 50 సంవత్సరాలుగా అమెరికన్లపై జరిగిన హింసాత్మక దాడులకు ప్రతిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి భారీ పరిహారాన్ని డిమాండ్ చేస్తామని గట్టిగా చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

Trump Reignites Iran Compensation Plan Citing War Damage referenced and claimed low-keying approach

ఇరాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదం, రోడ్‌సైడ్ బాంబు దాడుల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది సైనికులు, సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. జనరల్ ఖాసిం సులేమానీ నేతృత్వంలో జరిగిన దాడుల పరిణామాలను ఆయన ప్రధానంగా ఈ ట్వీట్ లో ప్రస్తావించారు. 2000లో యెమెన్ పోర్ట్ లో యూఎస్ఎస్ కోల్ యుద్ధనౌకపై జరిగిన భీకర దాడిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఆ రెండు ఆలయాల్లో టీటీడీ జేఈఓ నిర్వహించిన తనిఖీల్లో..
ఆ రెండు ఆలయాల్లో టీటీడీ జేఈఓ నిర్వహించిన తనిఖీల్లో..

దశాబ్దాలుగా అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ సృష్టించిన అశాంతికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పారు. గత 50 ఏళ్లుగా ఇరాన్ ప్రభుత్వ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన నిరసనకారుల కుటుంబాలకు కూడా తగిన పరిహారం అందాలని డిమాండ్ చేశారాయన. ఈ అయిదు నెలల్లో కాలంలో వివిధ ఘర్షణల్లో మరణించిన 52,000 మంది బాధితుల కుటుంబాలకు ఇరాన్ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు.

బంగాళాఖాతంపై తీవ్ర అల్పపీడనం- ఏపీలోని ఈ పట్టణాల్లో వర్షాలు: అలర్ట్ జారీ
బంగాళాఖాతంపై తీవ్ర అల్పపీడనం- ఏపీలోని ఈ పట్టణాల్లో వర్షాలు: అలర్ట్ జారీ

భవిష్యత్తులో ఇరాన్‌తో జరగబోయే అన్ని చర్చల్లోనూ ఈ నిబంధనలను ఖచ్చితంగా చేర్చాలని తన ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, హార్ముజ్ జలసంధిపై ఉన్న నియంత్రణలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. యుద్ధ నష్టాలకు అమెరికా నష్టపరిహారం చెల్లించడంతో పాటు అంతర్జాతీయ బ్యాంకులలో స్తంభింపజేసిన తమ దేశ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రతిపాదన తెరమీదికి తెచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+