వారి తాట తీస్తా: సమంత వార్నింగ్
తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సమంత తన టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలతో నటించి పాపులర్ అయింది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ విడిపోయిన తర్వాతే సమంతకు మరింత పాపులారిటీ పెరిగిందని చెప్పొచ్చు.
మయో సైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం కథలు వింటూ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోంది. తాజాగా సోషల్ మీడియాపై సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను పెట్టిన పోస్ట్ లో... సోషల్ మీడియాను తక్కువగా వాడొద్దని, అంతర్జాతీయంగా ఎక్కువగా ఉపయోగించాలని సూచించింది. నిపుణులను కలవాలని, వారినుంచి సలహాలు తీసుకోవాలని, జీవితానికి ఇన్ స్పిరేషన్ గా నిలిచే వ్యక్తులతో సంభాషిస్తుండాలని, సానుకూల స్నేహాన్ని సృష్టించాలని సూచించింది.

తప్పుడు కామెంట్లు చేయడం, ఫిర్యాదులు చేయడం, వ్యతిరేకతను వ్యాప్తి చేయడం, తప్పుడు ప్రచారాలను ఆపడంలాంటివి మానుకోవాలని సూచించింది. దీనిద్వారా మెదడులో పాజిటివిటీ పెరుగుతుందని తెలిపింది. సమంత పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ షోతో ఫొటోలను అప్ డేట్ చేస్తూ, అభిమానులతో ముచ్చటిస్తూ వారికి దగ్గరగానే ఉంటోంది. ఇటీవలి కాలంలో సినిమాల్లో నటించనప్పటికీ వెబ్ సిరీస్ లో మాత్రం నటించింది. త్వరలోనే ఇది విడుదలవడానికి సిద్ధంగా ఉంది. నాగచైతన్య-సమంత మళ్లీ కలిసిపోవాలని ఆ ఇద్దరి అభిమానులు మాత్రం కోరుకుంటుంటారు. జంట బాగుంటుందని, చిన్న చిన్న మనస్పర్థలవల్లే విడిపోయారని, వారిద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉందని అభిమానులు చర్చించుకుంటుంటారు. తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ పరోక్షంగా హెచ్చరించిందని అభిమానులు సోషల్ మీడియాలో దీనిపై కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications