నిశ్చితార్థం తర్వాత అక్కడికి వెళ్లిపోతున్న సమంత?

మయోసైటిస్ వ్యాధి సోకడంతో చికిత్స తీసుకునేందుకు ఏడాదిన్నరకు పైగా సినిమాలకు సమంత విరామం ప్రకటించింది. అయినప్పటికీ తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుండగా తన మాజీ భర్త నాగచైతన్య శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకోవడం ఒకరకంగా ఆమెకు షాక్ తగిలినట్లయిందని భావిస్తున్నారు. అధికారికంగా దీనిపై ఆమె స్పందించకపోయినప్పటికీ గతంలో వివిధ సందర్భాల్లో తన పెళ్లి, వివాహ జీవితంపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.

తన స్నేహితులతో కలిసి మరోసారి
వీటన్నింటినీ మరిచిపోయి సినిమాల్లో బిజీ అవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్న మా ఇంటి బంగారంలో నటిస్తోంది. హిందీలో షారుక్ ఖాన్ సరసన ఓ చిత్రం చేయబోతోందంటున్నారుకానీ ఇంతవరకు దీనిపై స్పష్టత రాలేదు. తన స్నేహితులు రాజ్ అండ్ డీకేతో కలిసి మరో వెబ్ సిరీస్ కోసం పనిచేయబోతోంది. అత్యంత ఉత్కంఠ రేకెత్తించే కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కబోతోందని, 'తుంబాద్' త‌ర‌హాలో ఒక రహస్య ప్రపంచంలో సాగే కథలో నటించబోతోంది. తుంబాద్ పలు అవార్డులతోపాటు రివార్డులను కూడా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

heroine samantha will act another web series raj and dk direction

రహస్య ప్రపంచంలోకి ప్రేక్షకులు
ఈ సిరీస్ లో కూడా సమంత పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రేమ, త్యాగం, కుట్రలు, విధి.. లాంటి అంశాలతో ఈ కథను తెరకెక్కించబోతున్నారు. ఈ సిరీస్ చూసే ప్రేక్షకులకు ప్రత్యేక ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంలో దర్శకులు ఉన్నారు. చూస్తున్న ప్రతి క్షణం టెన్షన్ అనుభవించాలనేది వీరి లక్ష్యం. అందుకనుగుణంగా అవసరమైనవాటిని దర్శకులు సిద్ధం చేశారు. ముందుగా సినిమాగా తీద్దామనుకున్నప్పటికీ సిరీస్ అయితే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నారు. ఈ సిరీస్ తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావంలో సమంత ఉన్నారు. ఈ సిరీస్ పూర్తయ్యేలోగా కొన్ని సినిమాలను ఒప్పుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+