మహేష్ బాబుపై నోరు జారిన శ్రీలీల?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా త్రివిక్రమే తీశాడా? లేదంటే ఇంకెవరైనా తీశారా? అంటూ ప్రిన్స్ అభిమానులు, సినీ ప్రియులు డైరెక్టర్ పై మండిపడ్డారు. సాదాసీదాగా సినిమాను తీశారని, కనీసం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ ఒక్కటికూడా లేదని, కేవలం సినిమా రూ.230 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిందంటే అది
మహేష్ బాబు ఛరిష్మామీదే అని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించేశారు.
ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా సినిమా బాగా వసూలు చేసినప్పటికీ కథ పరంగా దరిద్రంగా ఉందని అందరూ వ్యాఖ్యానించారు. శ్రీలీల కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా బయటపెట్టినట్లు తెలుస్తోంది. తన స్నేహితురాళ్లతో కలిసి ఉన్న సమయంలో గుంటూరు కారం సినిమా హిట్ అయిందికదా.. పార్టీ ఇవ్వమంటూ అడిగారంట. అయితే దీనిపై శ్రీలీల షాకింగ్ కామెంట్స్ చేసిందంటున్నారు.

నా బొంద ..ఆ సినిమా హిట్టు ..నేను మీకు పార్టీ ఇవ్వాలి.. అంటూ నోరు జారిందంట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. హీరోయిన్ గా నటించిన శ్రీలీల ఇలాంటి కామెంట్లు చేసిందంటూ ప్రిన్స్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తన రేంజ్ కు మహేష్ బాబు లాంటి హీరో అవకాశం ఇవ్వడమే గొప్ప అని, అటువంటి విషయాన్ని మర్చిపోయి ప్లాప్ అయిన సినిమాపై బహిరంగంగా ఇలాంటి కామెంట్లు చేయడమేంటి? అంటూ మండిపడుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.చినబాబు ఈ చిత్రాన్ని నిర్మించగా తమన్ సంగీతాన్ని అందించారు. పాటల పరంగా కూడా ఈ సినిమా మ్యూజిక్ మ్యాజిక్ చేయలేకపోయిందని, అన్నింటిలోను వైఫల్యం చెందడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే కారకుడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications