అన్నింటికీ దూరం: లియో దర్శకుడి సంచలన ప్రకటన..!!
Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్. మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన తమిళ దర్శకుడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో.. ఈ సినిమాలు చాలు అతని రేంజ్ ఏంటో తెలియజేయడానికి. లోకనాయకుడు కమల్ హాసన్‌తో తీసిన విక్రమ్, దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లియో.. కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టుకున్నాయి. బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.
ప్రస్తుతం లియో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్నాడు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్‌ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడీ మోస్ట్ ప్రామిసింగ్ తమిళ్ ఫిల్మ్ మేకర్. తాజాగా అతని సమర్పణలో వచ్చిన మూవీ ఫైట్ క్లబ్ (Fight Club). అబ్బాస్ ఎ రహ్మత్ దర్శకుడిగా తమిళ తెరకు పరిచయం అయ్యాడు ఈ మూవీ ద్వారా.

విజయ్ కుమార్, మోనీషా మోహన్ మీనన్ లీడ్ క్యారెక్టర్స్ చేశారు. కార్తికేయన్ సంతానం, శంకర్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. శుక్రవారమే ఈ సినిమా విడుదలైంది. ఫర్వాలేదనిపించుకుంది. పాజిటివ్ రివ్యూస్‌ను తెచ్చుకుంది. డ్రగ్స్, డ్రగ్ పెడ్లర్స్ చుట్టూ నడిచే కథ ఇది. జీ స్క్వాడ్ బ్యానర్ కింద ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ కీలక ప్రకటన చేశారు. తన సమర్పణ వచ్చిన ఫైట్ క్లబ్ సినిమాను ఆదరించినందుకు సినీ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. తన మొట్టమొదటి ప్రయత్నంగా జీ స్క్వాడ్ బ్యానర్ కింద ఫైట్ క్లబ్ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించానని పేర్కొన్నాడు.
🤗❤️ pic.twitter.com/0EL6PAlbdQ
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 16, 2023
ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టానని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయని పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ ఏమిటనేది త్వరలోనే తెలియజేస్తానని, పూర్తి వివరాలను అందిస్తానని అన్నాడు.
ఈ నేపథ్యంలో కొద్దిరోజుల పాటు తాను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండబోతోన్నానని లోకేష్ కనకరాజ్ ప్రకటించాడు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా అన్నింటినీ వదిలివేస్తోన్నానని, చివరికి సెల్ ఫోన్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదని తెలిపాడు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశాడు.












Click it and Unblock the Notifications