"ఇరుముడి" మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనే..!

మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ చిత్రం 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21 న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. కొంతకాలంగా ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోవడంతో ఫ్యాన్స్ డిజపాయింట్ తో ఉన్న సంగతి తెలిసిందే. భర్త మహాశయులకు విజ్ఞప్తి, మాస్ జాతర, ఈగల్ చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కంటెంట్ ను నమ్ముకుని మాస్ మహారాజ టైటిల్ ను పక్కనపెట్టి మరీ చేసిన చిత్రం 'ఇరుముడి'.. తండ్రీ కూతురు సెంటిమెంట్, డివోషనల్ టచ్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కింది.

ఇక ఇరుముడి సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 14.80 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ను అందుకున్నట్లు సమాచారం. అలాగే గ్రాస్ పరంగా చూస్తే రూ. 17.20 కోట్లు వసూల్లు వచ్చినట్లు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ ​లోనూ ఈ మూవీ రూ.7 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో తొలిరోజే ఇరుముడి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 24.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసి రికార్డు నెలకొల్పింది. మరోవైపు ఇరుముడి సినిమాకు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్​స్ లో కలిపి ఏకంగా 1 మిలియన్ టికెట్ సేల్స్ అయినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గంటలకు దాదాపు 32 వేలకు పైగా టికెట్స్ బుకింగ్ అవుతున్నాయి. ఇవాళ, రేపు కూడా థియేటర్ల వద్ద మాస్ మహారాజ రవితేజ జాతర కంటిన్యూ కానుంది.

ఇరుముడి మూవీ ఘన విజయం సాధించిన సందర్భంగా మూవీటీమ్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నారని మీకు తెలుసా..? అవును ఇరుముడి స్టోరీ ముందుగా రవితేజ వద్దకు వెళ్లలేదట. ఈ స్టోరీని దర్శకుడు శివ నిర్వాణ ముందుగా కింగ్ నాగార్జునకు చెప్పారట. అయితే ఈ కథను విని బాగుందని చెప్పినప్పటికీ ఆ తర్వాత తనకు డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదని చెప్పారట. అయితే ఈ మూవీని నాగార్జున చేసినా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని అటు నాగ్ ఫ్యాన్స్.. ఇటు రవితేజ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వరుస ప్లాఫ్స్ తో ఉన్న రవితేజకు సినిమాతో ఒక మంచి కంబ్యాక్ అయితే దొరికిందనే చెప్పాలి.

Irumudi director Shiva Nirvana initially narrated the story of the movie to King Nagarjuna buzz

ఇక ఇరుముడి మూవీలో రవితేజతో పాటు ప్రియా భవానీ శంకర్‌, సాయికుమార్‌, బేబీ నక్షత్ర, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+