నాగచైతన్య-సమంత విడాకులకు ఆ సినిమాతో లింకు?
దక్షణాది కథానాయికల్లో అందమైన ముద్దుగుమ్మ ఎవరు అంటూ అన్ని భాషల సినీ ప్రేమికులు ఠక్కున చెప్పే పేరు సమంత. మయోసైటిస్ వ్యాధి సోకడంతో ఏడాదిన్నరకు పైగా సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో ఓ సినిమా, ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఏమాయచేశావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో నటించారు. నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత హఠాత్తుగా విడిపోతున్నామని తెలిపేసరికి సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. పరిశ్రమలో మంచి జంటగా, ముచ్చటైన జంటగా పేరుతచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
నాగచైతన్య చేయనని చెప్పాడు
వివాహం జరిగిన తర్వాత సమంత జాను సినిమా చేసింది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 సూపర్ హిట్ మూవీకి ఇది రేమేక్. దిల్ రాజు ఎంతో ముచ్చటపడి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. నాగచైతన్య, సమంతతో చేయాలని ప్రయత్నించారు. కథ వినిపిస్తే నాగచైతన్యకు నచ్చలేదు. ఎంత చెప్పినప్పటికీ నాగచైతన్య మాత్రం సినిమా చేయనని ఖరాఖండిగా చెప్పేశారు. సమంత మాత్రం చేస్తానని చెప్పింది. తర్వాత ఈ కథను శర్వానంద్ కు వినిపించి, అతనికి నచ్చడంతో వీరిద్దరితో సినిమాను దిల్ రాజు పట్టాలెక్కించారు.

ఔట్ ఫుట్ చూసిన తర్వాత దిల్ రాజుకు స్పష్టత
సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం మొత్తం ఔట్ ఫుట్ చూసుకున్న తర్వాత దిల్ రాజుకు ఈ సినిమాపై ఓ స్పష్టత వచ్చింది. సమంత కథానాయికగా ఉన్నప్పటికీ ప్రమోషన్లు కూడా చేయకుండా వదిలేశారు. విడుదలైన తర్వాత సినిమా ఫ్లాప్ అయింది. తమిళంలో సూపర్ హిట్ అయతే తెలుగులో ఎందుకు ఫ్లాప్ అయిందనేదానిపై దిల్ రాజుకు కూడా అర్థం కాలేదు. ఎక్కడో తప్పుచేశామని భావించారు. ఆ విధంగా నాగచైతన్య జడ్జిమెంట్ కరెక్ట్ అయింది. తర్వాత ఈ సినిమా వద్దని చెప్పినప్పటికీ సమంత చేసిందనే కారణం కూడా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి కారణమంటారు. అలాగ వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి ఈ సినిమా కూడా ఓ కారణమైందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు












Click it and Unblock the Notifications