స్టార్ హీరో సెల్ లో టీవీ, వచ్చేది ఒకేఒక్క ఛానల్, పగవాడికి కూడా ఈ శిక్ష వద్దు
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్ హై సెక్యూరిటీ సెల్‌లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పడు హీరో దర్శన్ ఉండే సెల్ లో టీవీని అమర్చారు. అయితే ప్రస్తుతం హీరో దర్శన్ ఆ టీవీలో దూరదర్శన్ ఛానల్ మాత్రమే చూస్తున్నాడని, వేరే ప్రైవేట్ టీవీ ఛానళ్లను చూడటానికి ఏమాత్రం అవకాశం లేదని బళ్లారి సెంట్రల్ జైలు అధికారులు తెలిపారు.
టీవీ పెట్టిన తర్వాత సెల్‌లో కూర్చోవడానికి కుర్చీ, పడుకోవడానికి దిండు ఇవ్వాలని హీరో దర్శన్ జైలు సిబ్బందిని కోరారు. అయితే ఈ డిమాండ్ ను జైలు అధికారులు తిరస్కరించడంతో హీరో దర్శన్ తాను కోర్టును ఆశ్రయిస్తానని జైలు సిబ్బందికి చెప్పినట్లు సమాచారం.
హత్య కేసులో అరెస్టు అయిన హీరో దర్శన్ ను మొదట బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

బెంగళూరులోని పరప్సన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటున్న హీరో దర్శన్ అదే జైలులో ఉన్న రౌడీషీటర్ విల్సన్ గార్డెన్ నాగతో పాటు మరి కొంత మంది ఖైదీలతో కలిసి జైలు ఆవరణంలో దర్జాగా టీ పార్టీ చేసుకుంటూ సిగరెట్లు కాల్చుతూ ఉన్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కోర్టు అనుమతి తీసుకున్న జైళ్ల శాఖ అధికారులు హీరో దర్శన్ ను బెంగళూరు సెంట్రల్ జైలు నుండి బళ్లారి సెంట్రల్ జైలుకు మార్చేశారు.
కన్నడ స్టార్ హీరో
దర్శన్‌ను మంగళవారం ఆయన భార్య విజయలక్ష్మి, బంధువులు, స్నేహితులు పరామర్శించారు. దర్శన్ ను ఆయన భార్య విజయలక్ష్మి, సమీప బంధువు సుశాంత్ రెడ్డి, సన్నిహితుడు హేమంత్, నటుడు ధన్వీర్‌లను కలిశారు. తదుపరి న్యాయ పోరాటంపై భార్య విజయలక్ష్మి, బంధువులతో హీరో దర్శన్ చర్చించినట్లు తెలిసింది. భర్త ఆరోగ్యంపై ఆరా తీసిన భార్య విజయలక్ష్మ. దేవుడు ఉన్నాడని, మీరు ధైర్యంగా ఉండండి అంటూ భర్తకు ధైర్యం చెప్పిందని తెలిసింది. హీరో దర్శన్ ను చూసిన వెంటనే ఆయన సన్నిహితుడు హేమంత్, నటుడు ధన్వీర్ కన్నీళ్లు పెట్టుకున్నారని జైలు సిబ్బంది చెప్పారని కన్నడ మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications