Devara glimpses విడుదల వేళ తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ కపూర్: త్వరలో అతనితో పెళ్లి?
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. కొరటాల శివ దర్శకుడు.
యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోంది మూవీ. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా ఇదే. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ఎక్స్‌పెక్ట్ చేస్తోన్నారు అభిమానులు. ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్ (Devara firstlook) హైప్ క్రియేట్ చేసింది. భైరవగా సైఫ్ అలీ ఖాన్ గెటప్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
2024 ఏప్రిల్ 5వ తేదీన ఫస్ట్ పార్ట్ ఈ విడుదల అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ తేదీ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సినిమా యూనిట్ కష్టపడుతోంది. ఆర్ఆర్ఆర్ తరువాత అంతకుమించిన స్థాయిలో ఉండేలా దేవరను తీయాలనే ఉద్దేశంలో చిత్రం యూనిట్ ఉంది.
శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి జాహ్నవీ కపూర్..!!#JanhviKapoor #TirumalaTemple #TirumalaTirupatiDevasthanams #Oneindiatelugu pic.twitter.com/LDHa8lAbOx
— oneindiatelugu (@oneindiatelugu) January 5, 2024
దేవర ఫస్ట్ గ్లింప్సెస్ (Devara glimpses) ఈ నెల 8వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఓ షార్ట్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ ఆఫ్ దేవర (World of Devara) దీన్ని విడుదల చేయనుంది యూనిట్. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దేవర గ్లింప్సెస్ విడుదల కానున్న వేళ.. జాన్వీ కపూర్ తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. తన స్నేహితుడు శిఖర్ పహారియా, చిన్నమ్మ గులాబీ ఫేమ్ హీరోయిన్ మహేశ్వరితో కలిసి ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏడాది కాలంలో జాన్వీ కపూర్ తిరుమలకు రావడం ఇది రెండోసారి. గత ఏడాది ఏప్రిల్ 3వ తేదీన ఆమె శ్రీవారిని దర్శించిన విషయం తెలిసిందే.
శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. గతంలో కాఫీ విత్ కరణ్ టాక్ షోలో కూడా ఆమె ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు కూడా. ఈ పరిస్థితుల్లో వారిద్దరూ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications