ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జోష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే..
జోష్ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించిన టాలీవుడ్ నటి కార్తీక గుర్తుందా... అదేనండి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు. కార్తీక తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించిన ఆ సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితాలు అందించలేదు. దాంతో ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేసింది. అందులో తీసిన కొన్ని సినిమాలు మంచి విజయాలను చవిచూశాయి. అయితే, తాజాగా ఈ అమ్మడు ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.
ఓ అబ్బాయిని కౌగలించుకొని చేతికి ఉన్న రింగ్ చూపిస్తూ ఉన్న ఫోటోని సోషల్‌మీడియాలోని తన ఖాతాలో షేర్ చేసింది కార్తీక. దీంతో కార్తీక నిశ్చితార్థం చేసుకుందని తెలుస్తుంది. ఇప్పడు ఆ ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే, ఇంతకీ కార్తికను చేసుకోబోయే వరుడు ఎవరో తెలియాల్సి ఉంది.

రంగం సినిమా విజయం : జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది కార్తీక. ఆ తర్వాత తమిళ్‌లో తీసిన రంగం సినిమా భారీ విజయాన్ని అందించింది. తెలుగు, తమిళ్ లో పలు సినిమాల్లో నటించిన కార్తీక 2015 లో తమిళ్‌లో ఓ సినిమా చేసి తర్వాత సినిమాలకు దూరమైంది. అప్పటినుంచి బిజినెస్‌లను చూసుకోవడం మొదలుపెట్టింది. కార్తీక కుటుంబానికి కొన్ని హోటల్స్ ఉన్నాయి. వాటి బాధ్యతంతా ఇప్పడు కార్తీకదే.
ఇటీవలే దుబాయ్‌లో తమ బిజినెస్‌లను విస్తరించి పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఒక బిజినెస్‌వుమెన్‌గా కెరీర్లో దూసుకుపోతుంది. అయితే ఇప్పడు ఆమె సీక్రెట్‌గా ఎంగెజ్‌మెంట్ చేసుకుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ ఫోటోలను చూసినవారంతా కార్తీకకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications