క్షమించండి అంటున్న ఎన్టీఆర్.. వీడియో ఫుల్ వైరల్ !

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలసి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన మూవీ "వార్ 2". బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా స్పై యూనివర్స్‌లో భాగంగా రాబోతుండగా.. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

మూవీ రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న తరుణంలో.. ఆదివారం ( ఆగస్టు 10, 2025 ) రాత్రి హైదరాబాద్ యూసుఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. వేలాదిగా అభిమానులు తరలి రావడంతో వేదిక ప్రాంతం నిండిపోయింది. అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

jr-ntr-apologies-to-telangana-government-and-video-goes-viral

ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..

ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తన 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు. 13 ఏళ్ల క్రితం వరంగల్‌లో బాద్షా ఈవెంట్ సమయంలో తొక్కిసలాటలో ఒక అభిమాని మృతి చెందడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. అందుకే పబ్లిక్ ఈవెంట్స్ అంటే కొంచెం భయం వేసేది. వార్ 2 నేను చేయడానికి కారణం ఆదిత్య చోప్రా.. ఆయన 'ఈ సినిమా నువ్వు చేయాలి, నీ అభిమానులు గర్వపడేలా ఉంటుంది' అని చెప్పినప్పుడు భరోసా కలిగింది" అన్నారు.

ఎన్టీఆర్ ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష..

రామోజీరావు నన్ను పరిచయం చేసినప్పుడు నా పక్కన అమ్మ, నాన్న తప్ప ఎవరూ లేరు. అప్పుడు నన్ను కలిసిన మొదటి అభిమాని మూజీబ్. అక్కడి నుంచి మొదలైన ప్రయాణంలో ఇంతమంది అభిమానుల ప్రేమను పొందడం నా అదృష్టం. నన్ను నిరంతరం ప్రోత్సహించిన నాన్న హరికృష్ణ, అమ్మ షాలినితో పాటు దర్శకనిర్మాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను'' అని తెలిపారు. తన తాత, దివంగత నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ క్షమాపణ వీడియో..

ఈవెంట్ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ ఎక్స్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఈవెంట్ సజావుగా జరగడానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, పోలీస్ డిపార్ట్మెంట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. అభిమానుల ఆనందానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనాలు" అన్నారు. ఈవెంట్ ఉత్సాహంలో ఈ విషయాన్ని స్టేజ్ మీద చెప్పడం మర్చిపోయానని క్షమాపణలు కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+