ఆ కమీనే గాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: నిప్పులు చెరిగిన జూనియర్ ఎన్టీఆర్
వీడియో మార్ఫింగ్ పై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర మూవీలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఎన్టీఆర్- జాన్వీకపూర్ చుట్టమల్లే.. పాట ఆధారంగా కొందరు ఆకతాయిలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఓ అసభ్యకర మార్ఫింగ్ వీడియోను సృష్టించారు. దీన్ని ఎన్టీఆర్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడేవారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోనని అన్నారు.
భారతీయ సనాతన సంస్కృతిలో మహిళలను తల్లిగా, దేవతలుగా ఆరాధించే సాంప్రదాయం ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన దేశంలో మాతృదేవోభవ.. అనేది ఓ నినాదమో, ఓ మాటో కాదని, అది మన జీవన విధానంలో కలిసిపోయిన ఒక గొప్ప సంస్కృతి అని పేర్కొన్నారు. సమాజంలో కొందరు వ్యక్తులు ఇంతలా దిగజారిపోయి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తూ మహిళల గౌరవానికి భంగం కలిగించడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై వైరల్ అవుతున్న చుట్టమల్లే.. మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్న వికృత మనస్తత్వాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఈ రకమైన వీడియోలను సృష్టించిన వారితో పాటు దీనిని వైరల్ చేస్తోన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. సైబర్ నేరాలకు పాల్పడేవారికి బుద్ధి వచ్చేలా ఈ వ్యవహారంలో ముందుకు వెళ్తామని ఎన్టీఆర్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
ఈ సున్నితమైన అంశంపై సోషల్ మీడియా యూజర్లకు పిలుపునిచ్చారు.. జూనియర్ ఎన్టీఆర్. ఇటువంటి అసభ్యకర, కించపరిచే కంటెంట్‌ను ఎవరూ వీక్షించకూడదని, ఇతరులకు షేర్ చేయకూడదని కోరారు. ఈ రోజు ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.. రేపు అది మన ఇంట్లో తల్లి, సోదరి, భార్య, సొంత కుమార్తెకు కూడా ఎదురుకావచ్చని వ్యాఖ్యానించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం కావడం అనేది సమాజానికి ఒక పెద్ద సవాలుగా మారిందని ఎన్టీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రకమైన డిజిటల్ నేరాలను అరికట్టడానికి తక్షణమే కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను తేవాలని ఎన్టీఆర్ డిమాండ్ చేశారు.
Disgusting, Sick and Shameless.
— Jr NTR (@tarak9999) October 3, 2026
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using…














Click it and Unblock the Notifications
