జై బాలయ్య అన్న అభిమాని..ఎన్టీఆర్ ఉగ్రరూపం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'వార్-2' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్,ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టాయి. దీనిలో భాగంగానే ఆదివారం 'వార్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అతిరథ మహారథులు, అభిమానుల మధ్య భారీ ఎత్తున జరిగింది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 'వార్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ తన 25 ఏళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమా "నిన్ను చూడాలని" షూటింగ్ తొలి రోజును గుర్తు చేసుకుంటూ..ఓ వ్యక్తి నా వెనుకే తిరిగాడు. ఎవరు మీరని అతన్ని ప్రశ్నిస్తే..నా పేరు ముజీబ్ నేను మీ అభిమానిని బాబు అని చెప్పడంతో షాక్ అయ్యానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

అతని మాటలు విని షాక్ అయ్యానని,ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.. అప్పుడే ఫ్యాన్ అని ప్రశ్నిస్తే.. నేను మీతోనే ఉంటానని అతను చెప్పడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపే సమయంలో .. సదరు వ్యక్తి స్టేజ్‌పైకి రావడంతో ఎన్టీఆర్ సైతం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా అభిమాని ఉండటం ఎంతో అదృష్టమని ఎన్టీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా కొందరు అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇది విన్న ఎన్టీఆర్ .. మీరు సైలెంట్‌గా ఉంటారా..? లేదా నన్ను వెళ్లిపోమంటారా ..? మైక్ ఇచ్చి వెళ్లిపోతా అంటూ అభిమానులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత , నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒంటరయ్యారు.ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్‌పై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు.
అప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను దూరం పెడుతూ వస్తోంది.బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ ,రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు. దీనిపై ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు సైతం రియాక్ట్ అయ్యారు.బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఈ సెలబ్రేషన్స్‌కు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు ఆహ్వానం అందలేదు. తాజాగా జరిగిన ఈ ఘటనతో మరోసారి నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి.












Click it and Unblock the Notifications