బాలయ్య 'పద్మభూషణ్' పార్టీకి ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ను భువనేశ్వరి పిలవలేదా?

నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. 50 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగానికి చేస్తున్న సేవతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిద్వారా పేదలకు చేస్తున్న సేవను గుర్తించి ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులతోపాటు నారా వారి కుటుంబ సభ్యులు, తెలుగు సినీ రంగ ప్రముఖులు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలంతా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన సోదరుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులందరికీ పార్టీ ఇవ్వాలని నారా చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి భావించారు. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో శనివారం సాయంత్రం పార్టీ ఇచ్చారు.

తెల్లవారుజామునే నివాళి అర్పించారు
ఈ పార్టీలో కేవలం నందమూరి వంశంతోపాటు ఇతర బంధువులు, కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరుకాలేదు. పార్టీ ఏర్పాట్ల బాధ్యతలన్నీ భువనేశ్వరి చూసుకున్నారు. కాబట్టి ఆమె వారిని పిలిచారా? లేదా? అనే విషయం తెలియలేదు. నందమూరి కుటుంబంతో వీరిద్దరూ కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు. ఏ వేడుకకు హాజరుకావడంలేదు. ఎన్టీఆర్ వర్థంతి రోజు కూడా వీరిద్దరూ తెల్లవారుజామునే వెళ్లి నివాళులర్పించి వచ్చారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమా తీసే సమయంలో కూడా తారక్ తో బాలయ్యకు మంచి సంబంధాలే ఉన్నాయి. తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. వారిద్దరికే తెలియాలి.

junior NTR and Kalyan Ram not invited to balakrishna Padma Bhushan party

పిలిచారా? లేదంటే కావాలనే పిలవలేదా?
నిన్న జరిగిన వేడుకకు కూడా వీరిద్దరూ హాజరుకాకపోవడంతో ఆహ్వానం అందిందా? లేదా? లేదంటే కావాలనే రాలేదా? అసలు పిలవలేదా? అనే చర్చలు తెలుగు ఫిలింనగర్ లో జరుగుతున్నాయి. వీరిద్దరి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న బాలయ్య చెప్పడంవల్లే బహుశా పిలిచివుండకపోవచ్చని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరిన సమయంలో కూడా తారక్, కల్యాణ్ రామ్ రాకపోవడంపై నందమూరి అభిమానులు బాధపడుతున్నారు. ఈ గొడవలు ఎప్పటికి చల్లారతాయో.. హరికృష్ణ జీవించివున్నా బాగుండేది అనుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+