మహేష్‌బాబు - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్
తెలుగులో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తారక్ నటించిన దేవర చిత్రం ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. దీనికి దర్శకుడు కొరటాల శివ. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి చిత్రానికి ఓకే చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మహేష్ కూడా సినిమా కథకు అనుగుణంగా మేకోవర్ అవుతున్నాడు. దీనికి సంబంధించి జర్మనీలో శిక్షణ కూడా తీసుకొచ్చాడు.
మల్టీస్టారర్ చేయడానికి అంగీకారం తెలిపాడు
సినిమా ప్రపంచం నుంచి బయటకు వస్తే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఎంతో స్నేహంగా ఉంటారు. సఖ్యతగా ఉంటారు. ఎన్టీఆర్ సూపర్ స్టార్ ను అన్నా అని పిలుస్తుంటారు. ఒకరి సినిమాలకు మరొకరు అతిథులుగా హాజరవుతారు. వారిద్దరూ కలిసి మల్టీస్టారర్ చేయడానికి కూడా అంగీకారం తెలిపారు. వాస్తవానికి ఓ దర్శకుడు వీరిద్దరితో సినిమా చేయడానికి అన్నీ సిద్ధం చేశారు. ఆ తర్వాత అనుకోకుండా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ చేయడంతో అది వాయిదా పడింది. తారక్ హోస్ట్ గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేష్ బాబు వచ్చారు.

ఎగ్జైట్ మెంట్‌గా అనిపించేది
ఆ సందర్భంగా తారక్ మహేష్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. అన్నా.. మనిద్దరం కలిసి మల్టీస్టారర్ చేయాలని మీకు అనిపించలేదా? అని అడిగాడు. అందుకు మహేష్ బాబు మనిద్దరం ఎప్పుడు కలిసినా ఓ సినిమా చేద్దామని అంటుండేవాడివి.. నాకు కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ గా అనిపించేది.. అయితే ఆ అవకాశం లేదుగా.. నువ్వు, చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ చేశారుగా అన్నాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ మల్టీస్టారర్ చేయడానికి బహిరంగంగానే ఆఫర్ చేశారుకానీ ఎవరూ ముందుకు రాలేదు. భవిష్యత్తులోనైనా అవకాశం వస్తుందేమోనని తారక్, మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications