జూనియర్ ఎన్టీఆర్ - అనుష్క కాంబోలో మిస్ అయిన సినిమాలు ఎన్నో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతుంటాయి. వాటిని తెరపై చూడాలంటూ అభిమానులంతా ఎదురుచూస్తుంటారు. కొన్ని కాంబినేషన్లు సెట్ అయినప్పటికీ మరికొన్ని కాంబినేషన్లు మాత్రం చర్చల వరకే పరిమితమవుతుంటాయి. వాటిని ఎలాగైనా వెండితెరపై చూడాలనుకున్నప్పటికీ అవి సఫలం కావు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలు సెట్ అయినట్లే అయి తర్వాత మిస్సయ్యాయి. ఆ కాంబినేషన్ ఎవరిది, ఎందుకు మిస్సయింది అనే విషయాలను తెలుసుకుందాం.
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో చింతకాలయ రవి చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ సినిమాకు మొదటగా జూనియర్ ఎన్టీఆర్ ను హీరో అనుకున్నారు. కానీ ఆ సినిమాను యంగ్ టైగర్ తిరస్కరించాడు. కాకపోతే ఇదే సినిమాలో చిన్న అతిథి పాత్రలో మెరిశాడు. కేవలం రెండు నుంచి మూడు నిముషాల సమయమే తారక్ ను, అనుష్కను దగ్గర దగ్గరగా చూడగలం. ఆ రకంగా ఈ మొదటి కాంబినేషన్ కుదరలేదు.

ఊసరవెల్లి సినిమా జూనియర్ కెరీర్ లోనే భారీగా విడుదలైంది. దాదాపు అప్పట్లోనే 1800 స్క్రీన్లలో దీన్ని ప్రదర్శించారు. అయితే ఈ సినిమా ఫ్లాపైనప్పటికీ నటన పరంగా జూనియర్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందులో హీరోయిన్ గా మొదట అనుష్కనే అనుకున్నారు. పాత్ర నచ్చకపోవడంతో ఆమె దీన్ని తిరస్కరించింది. తర్వాత తమన్నా దగ్గరకు కథ వెళ్లగా ఆమె ఓకే చెప్పింది. ఆ విధంగా తారక్, అనుష్క కాంబినేషన్ లో రెండో సినిమా మిస్సయింది.
ఊసరవెల్లి కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఫ్లాప్ అయిన ఎన్టీఆర్ నటనపరంగా ఈ సినిమా హిట్ అయింది .
ముచ్చటగా మూడో సినిమా.. జనతా గ్యారేజ్ తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో సమంత పోషించిన పాత్రకోసం ముందుగా అనుష్కను అనుకొని ఆమెను సంప్రదించారు మేకర్స్. అయితే అనుష్క ఈ పాత్రను కూడా తిరస్కరించింది. తర్వాత సమంత దగ్గరకు ఆ రోల్ వెళ్లగా ఆమె ఎంపిక చేసుకుంది. అలా తారక్-అనుష్క కాంబినేషన్ లో మూడు సినిమాలు మిస్సయ్యాయి. అభిమానులు ఎంతగా ఎదురుచూసినప్పటికీ వీరిద్దరి కాంబోలో సినిమా మాత్రం రాలేదు.












Click it and Unblock the Notifications