విడుదలకు ముందే 'దేవర' సంచలన రికార్డ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయం అవుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ ఐదోతేదీన విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుండటంతో మొదటి భాగం విజయ దశమికి వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని సెప్టెంబరు 27కు తేదీకి మార్చారు. దీనివల్ల ఓపెనింగ్ కలెక్షన్లతోపాటు సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే దసరా పండగకు వచ్చే సెలవులన్నీ బోనస్ అని చిత్ర బృందం అభిప్రాయపడుతోంది.
సినిమా బ్లాక్ బస్టరే
విడుదలకు ముందే దేవర సినిమా సంచలన రికార్డ్ ను నెలకొల్పింది. రిలీజ్ కు ముందే లాభాల్లోకి వెళ్లి నిర్మాతలను ఆనందంలో ముంచెత్తింది. ఈ చిత్రం నైజాం హక్కులను దిల్ రాజు దక్కించుకున్నారు. ఆయన దీనికోసం నిర్మాతలకు భారీగా ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత హిందీ బెల్టులో కరణ్ జోహార్, అనిల్ తడాని దక్కించుకున్నారు. వీరిద్దరూ ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో సినిమా బ్లాక్ బస్టర్ అయినట్లే అనే ఆనందంలో అభిమానులున్నారు. విదేశాల్లో కూడా దేవరను భారీగా విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు.

నిర్మాతల పంట పండింది
ఓవర్సీస్ లో విడుదల చేసేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చినప్పటికీ నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నాన్ థియేట్రికల్ వ్యాపారం కూడా పూర్తయింది. ఓటీటీలో విడుదల చేసేందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ హక్కులను దక్కించుకుంది. దీనికోసం ఎంత కోట్ చేసింది అనే విషయం బయటకు రాలేదు. స్టార్ మా సంస్థ శాటిలైట్ హక్కులను తీసుకుంది. దేవర విడుదలకు ముందే లాభాల్లోకి వచ్చిందని, విజయ దశమికి వచ్చే కలెక్షన్లన్నీ బోనస్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.












Click it and Unblock the Notifications