చంద్రబాబుపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వెనక ఆ వ్యక్తి హస్తం?
తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కుగా ఓడించిందని చెప్పొచ్చు. ఈ విజయాన్ని చూసిన వైసీపీ తీవ్ర షాక్ లో ఉంది. ఓటమిపాలైనప్పటికీ ఇంత ఘోరంగా ఓడిపోతామని జగన్ తో సహా ఎవరూ ఊహించలేదు. కూటమిని ముందుకు నడిపించడంతోపాటు ఓట్ల బదిలీ సజావుగా జరిగేలా చూసిన చంద్రబాబుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం సినిమాలు మాత్రమే
చంద్రబాబును గతేడాది వైఎస్ జగన్ ప్రభుత్వం స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజులపాటు ఉంచింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. అయితే చంద్రబాబుకు అల్లుడి వరసయ్యే జూనియర్ ఎన్టీఆర్ కానీ, నందమూరి కల్యాణ్ రామ్ కానీ స్పందించలేదు. వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ ఎవరితోను సత్సంబంధాలు కోరుకోవడంలేదని, వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, కేవలం సినిమాల్లోనే నటిస్తారని, వాటిపైనే దృష్టి ఉందంటూ ఆయన సన్నిహితులు చెప్పారు.

జరిగిన గొడవలు చాలు..
ఏపీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన చంద్రబాబుతోపాటు లోకేష్, బాలకృష్ణ, భరత్, పురంధేశ్వరికి పేరు పేరునా శుభాకాంక్షలు తెలియజేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై అందరూ విస్మయాన్ని వ్యక్తం చేశారు. తారక్ ట్వీట్ కు చంద్రబాబు రిప్లై ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం వెనక ఓ పెద్ద వ్యక్తి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇరు కుటుంబాల మధ్య అయిన వివాదాలు చాలని, అందరూ కలిసివుండాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే చంద్రబాబు, లోకేష్, బాలయ్యతో జూనియర్ ఎన్టీఆర్ భేటీని ఏర్పాటు చేసేలా ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆయన మాట ప్రకారమే తారక్ ట్వీట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ పెద్ద వ్యక్తి ఎవరనేది, ఆయన పేరు ఏమిటనే విషయం మాత్రం బయటకు రానివ్వడంలేదు.












Click it and Unblock the Notifications